మెహర్ రమేష్ కు స్ట్రాంగ్ గా జూ ఎన్టీఆర్ వార్నింగ్?
శక్తి దర్శకుడు మెహర్ రమేష్ కు జూ ఎన్టీఆర్ రీసెంట్ గా క్లాస్ పీకారంటూ ఓ వార్త వినపడుతోంది. ఆ క్లాస్ కూడా చాలా స్ట్రాగ్ గా ఉందని, రమేష్ డైరక్షన్ సరిగా చేయకుండా ఇతర విషయాలపై కాన్సర్టేషన్ పెట్టనుండటం ఎన్టీఆర్ కి నచ్చటం లేదని, రెండు మూడు సార్లు ఇండైరక్ట్ గా చెప్పి చూసాడని చెప్తున్నారు. అప్పటికీ తన ప్రవర్తన మార్చుకోకపోవటంతో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దత లేకపోతే కష్టమని, రెండో సారి తాను ఇచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోమని ఘాటుగా చెప్పారుట. అంతేగాక ఇలాగే కంటిన్యూ చేస్తే సినిమా జరుగుతుంది కానీ నువ్వు వుండవు వేరే వాళ్లతో లాగిస్తానని అన్నారట. జూ ఎన్టీఆర్ తరపునే నిర్మాత అశ్వనీదత్ కూడా మాట్లాడి దర్శకుడుని పనిలో పనిగా మందలించాడని సమాచారం. ఓవర్ బడ్జెట్ అవటం, షూటింగ్ పై దృష్టి పెట్టకుండా ఇతర ఏవిగేషన్స్ పై బిజీగా ఉండటం ఈ స్టైలిష్ దర్శకుడుని విమర్శలకు గురి చేసాలే చేస్తున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి, ప్రభాస్ తో చేసిన భిళ్లా రెండూ అంతంత మాత్రంగా ఆడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











