అతిథి పాత్రలో... జూ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి?
హైదరాబాద్: 'బాద్ షా' చిత్రంతో చాలా కాలం తర్వాత హిట్ సొంతం చేసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్...నెక్ట్స్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది. బాద్ షా భారీ విజయం సాధించడంతో తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న ఆసక్తికర విషయం ఏమిటంటే....ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిప్రణతి అతిథి పాత్రలో కనిపించనుందట. ఆమె ఇందులో 25 సెకన్ల పాటు కనిపించనుందట. ఇందులో ఆమె కాలేజీ స్టూడెంట్ గా కనిపించనుందని సోషల్ నెట్వర్కింగ్ స్టైట్లలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఉండనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని ల్యాంకో హిల్స్ సమీపంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. దసరా నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











