For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నందమూరి ఫ్యాన్స్‌కు పండుగే: రాజకీయాల్లోకి ఎన్టీఆర్.. బాలయ్య కోసం అక్కడ రంగంలో దిగబోతున్నాడు.!

  By Manoj
  |

  వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న ఈ టాలెంటెడ్ హీరో.. టాప్ పొజిషన్‌పై కన్నేశాడు. ఇందుకోసం కొన్నేళ్లుగా కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నాడు. డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటే తారక్.. తన మార్కెట్‌ను సైతం గణనీయంగా పెంచుకున్నాడు. అంతేకాదు, భారీ భారీ ఆఫర్లను సైతం చేజిక్కించుకుంటున్నాడు. ఈ తరుణంలో అతడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఓ వార్త లీక్ అయింది. అది కూడా తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ కోసం అని అంటున్నారు. ఇంతకీ దీని వెనుక కథ ఏంటి.? వివరాల్లోకి వెళితే...

  వాళ్లపై పోరాటానికి సిద్ధమైన తారక్

  వాళ్లపై పోరాటానికి సిద్ధమైన తారక్

  జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో అతడు పోరాట యోధుడు కొమరం భీమ్‌గా కనిపించనున్నాడు. అలాగే చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో తారక్.. ప్రత్యర్థులపై పోరాటం చేయనున్నాడు.

  ఇది పూర్తవకముందే అది ప్రకటిస్తారట

  ఇది పూర్తవకముందే అది ప్రకటిస్తారట

  తారక్ ప్రస్తుతం నటిస్తున్న RRR షూటింగ్ పూర్తవకముందే, అతడు చేసే తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందనన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన అంశాన్ని బట్టి చూస్తే.. ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నాడట. దీనిని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి.

  అన్నీ ఫిక్స్ అయ్యాయి.. అదే సెంటిమెంట్

  అన్నీ ఫిక్స్ అయ్యాయి.. అదే సెంటిమెంట్

  RRR షూటింగ్ పూర్తయిన వెంటనే తారక్.. త్రివిక్రమ్ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. దీనికి కూడా తన సెంటిమెంట్ ప్రకారం.. అతో మొదలయ్యే టైటిల్ ఫిక్స్ చేశాడట గురూజీ. ఇందుకోసం ఇప్పటికే ‘అయిననూ పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని అంటున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నాడు.

  ఫ్యాన్స్‌కు పండుగే.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్

  ఫ్యాన్స్‌కు పండుగే.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్

  ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు రోజులుగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ మూవీ రాజకీయాలతో కూడి ఉంటుందట. ఇందులో ఎన్టీఆర్ మొదట సాదాసీదా యువకుడిగా కనిపించినా.. మధ్యలో పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతాడని అంటున్నారు. త్రివిక్రమ్ డైలాగులు దీనికి ప్రధాన బలం అని ప్రచారం జరుగుతోంది.

  బాలయ్య కోసం రంగంలో దిగబోతున్నాడు.!

  బాలయ్య కోసం రంగంలో దిగబోతున్నాడు.!

  ఇదే సినిమాలో నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ తండ్రిగా చేస్తున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన అప్‌డేట్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ సినిమా సెకెండాఫ్‌లో పొలిటీషియన్ అయిన బాలయ్య తన తండ్రి అని తారక్‌కు తెలుస్తుందట. ఆయన కోసం రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడట ఎన్టీఆర్. అందుకోసం ఢిల్లీ (హస్తిన) వెళ్లి మరీ రాజకీయాలు చేస్తాడని అంటున్నారు. అప్పటి నుంచి కథ మలుపు తిరుగుతుందని సమాచారం.

  తారక్‌కు రాజకీయాలు కొత్త కాదు

  తారక్‌కు రాజకీయాలు కొత్త కాదు

  నందమూరి కుటుంబానికి, రాజకీయాలకు సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. ఆ కుటుంబ మూల పురుషుడు ఎన్టీఆర్.. గతంలో ఓ రాజకీయ పార్టీని స్థాపించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగానూ వ్యవహరించారు. అలాగే, హరికృష్ణ, బాలకృష్ణ సహా ఎన్టీఆర్ వారసులు కొందరు రాజకీయాల్లో సత్తా చాటారు. తారక్ కూడా ఆ మధ్య పార్టీ కోసం ప్రచారం చేశాడు.

  English summary
  Tollywood Young Hero Jr Ntr Busy with RRR Shooting. This movie Directed by SS Rajamouli. in This movie Mega power star Ram charan also Working. After This Ntr Will Work With Trivikram Srinivas Again. In This Movie Balakrishna Plays Key Role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X