Ayodhya Ram Mandir: ఎన్టీఆర్‌కు అయోధ్య ఆహ్వానం.. శ్రీరాముడి కార్యానికి దేవర డుమ్మా.. ఎందుకంటే!

యావత్ భారతదేశం అంతా వేయి కళ్లలో ఎదురు చూస్తున్న ఘట్టం మరికొద్ది రోజుల్లోనే జరగనుంది. అదే.. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం. జనవరి 22వ తేదీన ఈ మహోన్నత కార్యాన్ని పూర్తి చేయనున్నారు.

దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ఎంతో మంది సెలెబ్రిటీలకు కూడా ఆహ్వానం పంపించింది. అందులో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఇన్విటేషన్ రాగా.. అతడు హాజరు కావట్లేదట. ఎందుకో మీరే చూడండి!

Jr NTR will Not Attending to Ayodhya Ram Mandir Inauguration Event

దేశంలోనే గొప్ప కార్యంగా: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేశంలోనే గొప్ప కార్యంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లానింగ్‌ పూర్తవగా.. ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Jr NTR will Not Attending to Ayodhya Ram Mandir Inauguration Event

సినీ ప్రముఖులకు కూడా: జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇండియా వ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ముఖ్యంగా ఫిల్మ్ సెలెబ్రిటీలను ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారు. వీరిలో కొందరికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్వయంగా ఆహ్వాన పత్రికలను అందించారు.

Jr NTR will Not Attending to Ayodhya Ram Mandir Inauguration Event

టాలీవుడ్‌లోనూ చాలానే: అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. అందులో చిరంజీవి, రామ్ చరణ్, మోహన్ బాబు, ప్రభాస్ సహా చాలా మందే స్టార్లు ఉన్నారు. వీరిలో చాలా మంది ఈ మహోన్నత కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు స్వయంగా వెల్లడించారు.

ఎన్టీఆర్ కూడా ఆహ్వానం: మరికొద్ది రోజుల్లోనే అయోధ్యలో జరగనున్న అత్యున్నత కార్యక్రమానికి ఇప్పటికీ ఆహ్వానాలు అందుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఇన్విటేషన్ వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అతడి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఆహ్వానం ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారు? అన్నది తెలియలేదు.

Jr NTR will Not Attending to Ayodhya Ram Mandir Inauguration Event

ఎన్టీఆర్ వెళ్లడం లేదట: అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే అతడు 'దేవర' షూటింగ్ కోసం డేట్స్ కేటాయించాడట. దీంతో చిత్ర యూనిట్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. అందుకే ఎన్టీఆర్ అయోధ్య వెళ్లడం లేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X