జూ ఎన్టీఆర్ క్షమాపణ చెబుతాడా??
కొడాలి నాని- జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు కాకపోయినప్పటికీ...అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అటువంటిది తెలంగాణా ఉద్యమం వాళ్లిద్దర్నీ తలోదిక్కున విడదీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమైక్యాంధ్ర ధ్యేయంగా విద్యార్థులు చేస్తున్న పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడమే కాక వారిని అరెస్టు చేయడాన్ని కొడాలి నాని తీవ్రంగా ఖండించారు.
అదుర్స్ సినిమా విడుదలకి ముందు తెలంగాణా వాదులు అడ్డుకోవటంతో జూ ఎన్టీఆర్ తాను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చచ్చిపోతానని, తన సినిమాలను అడ్డుకోవద్దని తెలంగాణ ప్రజలకు విన్నవించుకున్నారు. దీంతో అదుర్స్ సినిమా ప్రదర్శన అడ్డంకులు తొలిగి విజయవంతమవుతున్న సమయంలో కొడాలి నాని అనవసరపు విమర్శలతో మళ్లీ ఇబ్బందుల్లో పడింది అదుర్స్. అంతేగాక జూ ఎన్టీఆర్ తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావ్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి జూ ఎన్టీఆర్ కి ఏమి సంబందం లేదని మరో ప్రక్క నాని వాదిస్తున్నారు. మరి జూ ఎన్టీఆర్ మరోసారి తెరమీదకి వచ్చి ఈ సమస్యని పరిష్కరించుకుంటాడా లేక దీనికి మరో దారి ఏదైనా వెదుక్కుంటాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











