Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్‌గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లస్ట్ స్టోరీస్ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా.. ఇప్పటి వరకు చేయని సబ్జెక్ట్‌తో వస్తున్నాడు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది యాక్టర్లు ఉన్నారు. వారిలో కొందరికి మాత్రమే ఆల్‌రౌండర్‌గా గుర్తింపు వచ్చింది. ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా చెప్పుకుంటూ ఉంటారు. దీనికి కారణం అతడు యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, కామెడీ ఇలా అన్నింటిలోనూ రాణిస్తుండడమే. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయిన తారక్.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అతడు మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఓ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!
డబుల్ హ్యాట్రిక్‌కు చేరువలో జూనియర్ ఎన్టీఆర్
కెరీర్ ఆరంభంలో కొన్ని సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, మధ్యలో మాత్రం అతడు వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ‘టెంపర్'తో అతడు మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత'తో డబుల్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు.
టాలీవుడ్ హిస్టరీలోనే భారీ చిత్రంలో తారక్
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నందమూరి హీరో తారక్. ఈ క్రమంలోనే అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అతడు కొమరం భీంగా నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ టాలీవుడ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఆ ప్రకటనతో వాటన్నింటికీ క్లారిటీ వచ్చేసింది
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRRకు ఎన్టీఆర్ ఏకంగా రెండు సంవత్సరాలు సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలోనే అతడు దీని తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్న దానిపై ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తారక్.. త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒకే ఒక్క దానితో పుకార్లుకు పుల్‌స్టాప్ పడిపోయింది.
పొలిటికల్ ఎంట్రీకి తారక్ సిద్ధం.. అందుకే ఇలా
త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాతో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ మూవీకి అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మంత్రి గారి వియ్యంకుడు' మూవీ ఆధారంగా తెరకెక్కనుందని ఓ వార్త చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే.
యంగ్ డైరెక్టర్‌తో సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం RRR షూటింగ్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీని పట్టాలెక్కించనున్నాడు. ఈ నేపథ్యంలో తారక్ తాజాగా యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఓ న్యూస్ లీక్ అయింది. ఇటీవలే స్క్రిప్ట్ విన్న నందమూరి హీరో.. వెంటనే ఓకే చేసేశాడని అంటున్నారు. ఇది త్రివిక్రమ్ మూవీ తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
Recommended Video
ఇప్పటి వరకు చేయని సబ్జెక్ట్‌తో వస్తున్నాడు.!
ప్రస్తుతం
తరుణ్
భాస్కర్..
వెంకటేష్‌తో
చేయబోయే
సినిమా
పనుల్లో
బిజీగా
ఉన్నాడు.
దీని
తర్వాత
అతడు
తెలుగు
లస్ట్
స్టోరీస్
ఓ
భాగానికి
దర్శకత్వం
వహించనున్నాడు.
ఆ
వెంటనే
ఎన్టీఆర్
సినిమా
స్క్రిప్ట్
వర్క్
మీద
దృష్టి
సారించనున్నాడట.
అటు
తరుణ్..
ఇటు
తారక్
ఇప్పటి
వరకు
టచ్
చేయని
సబ్జెక్టుతో
ఈ
మూవీ
తెరకెక్కబోతుందని
జోరుగా
ప్రచారం
జరుగుతోంది.