రాక్షసి దర్శకుడితో జూ ఎన్టీఆర్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన హనుతో ఓ టాప్ నిర్మాత ఒప్పందం కుదుర్చుకున్నాడని, ఇందులో జూ ఎన్టీఆర్ హీరోగా చేయనున్నట్లు సమాచారం.
హను రాఘవపూడి గతంలో రాజమౌళికి అసిస్టెంట్ గా పని చేశారు. యమగొంగ సమయంలోనే హనుతో జూ ఎన్టీఆర్‌కు పరిచయం ఉంది. హను పని తీరుపై నమ్మకంతోనే జూ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో 'బాద్ షా'అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం నేటి నుంచి ధాయ్‌లాండ్ లో జరగనుంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
మరో వైపు ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. జూ ఎన్టీఆర్‌తో దమ్ము చిత్రాన్ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్ బేనర్ వారు ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. దమ్ము చిత్రం అనుకున్న రేంజిలో ఆడక పోవడంతో పెద్దగా ఏమీ వెనకేసుకోలేక పోయిన నిర్మాతలు కెఎస్ రామారావు, వల్లభలకు మరో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట జూనియర్.


Click it and Unblock the Notifications











