ఆ తమిళ డైరక్టర్ తో జూ.ఎన్టీఆర్ తదుపరి సినిమా ఓకే
రీసెంట్ గా శక్తి వంటి డిజాస్టర్ ఇచ్చిన అశ్వనీదత్ ని ఆదుకోవటానికి ఎన్టీఆర్ అదే బ్యానర్ లో మరో చిత్రం చేయటానికి కమిటయ్యారని సమాచారం.అయితే ఈ సారి తమిళ దర్శకుడుతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ మద్యనే తమిళంలో కో అనే చిత్రం తీసి సూపర్ హిట్ ఇచ్చిన కె వి ఆనంద్ ని దర్శకుడుగా ఎంచుకున్నట్లు చెప్తున్నారు.ఆయన డైరక్టర్ గా మారి చేసిన రెండు చిత్రాలు రంగం, వీదొక్కడే తెలుగులో విడుదయ్యాయి కానీ వర్కవుట్ కాలేదు.అయితే ఆయన చెప్పిన స్టోరీ లైన్ ఎన్టీఆర్ కి నచ్చటంతో వెంటనే ఓకే చేసి పూర్తి స్క్రిప్టుతో కలవమని చెప్పాడుట.ప్రస్తుతం ఎన్టీఆర్ ..ఊసరవిల్లి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











