జూనియర్ ఎన్టీఆర్ తో నాని డైరెక్టర్.. టెన్షన్ లో నందమూరి ఫ్యాన్స్
ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ హీరోస్ లో టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకడు. మరి తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఆడియెన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో "దేవర" తో పాన్ ఇండియా మార్కెట్ లోకి రాబోతున్నాడు.
కాగా ఈ చిత్రం తన లాస్ట్ సెన్సేషనల్ సక్సెస్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ తర్వాత కూడా ఎన్టీఆర్ లైనప్ చూస్తే ఒక పాన్ ఇండియా హీరోకి సరిగ్గా సరిపోయే క్రేజీ ప్రాజెక్ట్ లని ఎన్టీఆర్ సెట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి పీక్ లైనప్ లో ఉన్నపుడు ఒక క్లాస్ దర్శకుని అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది?

ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ విషయంలో జరిగేలా ఉందని ఎన్టీఆర్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ కి పరిచయం చేసిన కొత్త దర్శకుడు శౌర్యువ్ కి ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో కొన్ని బలమైన ఊహాగానాలే వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు.
కాగా ప్రశాంత్ నీల్, కొరటాల శివ ఇంకో పక్క బాలీవుడ్ లో సెన్సేషనల్ సీక్వెల్ వార్ 2 లాంటి భారీ సినిమాలు ఒప్పుకున్నా నాని కేవలం ఒక్క సినిమా అది కూడా క్లాస్ దర్శకుడికి ఓకే చెప్పడం అనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మిగతా దర్శకులు మాస్ లో తమ టాలెంట్ చూపించారు కానీ ఈ దర్శకుడు విషయంలో మాత్రం కొంచెం టెన్షన్ పడుతున్నారు.

ఇప్పుడు ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. ఒకవేళ ఆ దర్శకుడు దానిని మ్యాచ్ చేయకపోతే ఎన్టీఆర్ సమయం వృథా అవుతుంది కదా అని వారు సంశయంలో ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రభాస్, రామ్ చరణ్ ల పంథాలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇప్పుడు కేవలం ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న బుచ్చిబాబు సానాతో సినిమా చేస్తుండగా ప్రభాస్ కూడా రాధే శ్యామ్, సాహో, ఆదిపురుష్ ఇప్పుడు కల్కి తక్కువ సినిమాలు చేసిన దర్శకులతోనే వర్క్ చేసాడు.
సో ఇదే స్ట్రాటజీలో తారక రాముడు కూడా వెళ్లాలని చూస్తున్నాడట. శౌర్యువ్ చెప్పిన కథ నచ్చింది కాబట్టే ఓకే చేసాడని టాక్. మొత్తానికి ఐతే ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ లోని టెన్షన్ ని పోగొడతాడో లేదా రెట్టింపు చేస్తాడో అనేది మాత్రం వేచి చూడాలి. కాగా ఇప్పుడు దర్శకుడు కొరటాలతో "దేవర"
సినిమాలో బిజీగా ఉండగా ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.


Click it and Unblock the Notifications











