‘రచ్చ’దర్శకుడుతో ఎన్టీఆర్.. డిటేల్స్

By Srikanya

రామ్ చరణ్ తేజ తాజా చిత్రం 'రచ్చ'తో కమర్షియల్ దర్శకుడుగా అందరి దృష్టిని ఆకర్షించిన సంపత్ నంది తాజాగా కథ చెప్పి మరో పెద్ద హీరోని ఒప్పించుకున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు జూ.ఎన్టీఆర్ అని ఫిల్మ్ నగర్ సమాచారం. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని చెప్తున్నారు. శక్తి సినిమా డిజాస్టర్ తో చతికిల పడ్డ అశ్వనీత్ కి మళ్లీ లేపటానికి ఎన్టీఆర్ ఓ చిత్రం చేస్తానని అప్పట్లో మాటిచ్చారు. దానికోసం ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కిస్తున్నట్లు చెప్తున్నారు.

ఇక 'ఏమైంది ఈవేళ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై సంపత్ నంది ఆ చిత్రం మంచి విజయంతో అందరి దృష్టిలో పడ్డాడు. అప్పటికే మెరపు చిత్రం ఆగిపోయి టెన్షన్ లో ఉన్న రామ్ చరణ్ ని కలిసి కథ చెప్పి ఒప్పించుకుని 'రచ్చ'ని మెటిరియలైజ్ చేసారు. సినిమా ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కలెక్షన్స్ పరంగా బాగుండటంతో అందరు హీరోలు సంపత్ నందితో చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మాస్ కోణంలో రామ్ చరణ్ ని ఈ చిత్రంలో బాగా ఎలివేట్ చేయటం ప్లస్ అయ్యింది.


ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు సరిపోయే ఓ విభిన్నమైన మాస్ ఎంటర్‌టైనర్ కథను సంపత్ సిద్ధం చేశాడని చెప్తున్నారు. ఇటీవల ఈ కథను విన్న ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్...దమ్ము విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. దమ్ము పై ఇప్పటికే చాలా పాజిటివ్ టాక్ ఉంది. ఊసరవెల్లి ప్లాప్ కావటంతో ఈ చిత్రం గ్యారెంటీగా దుమ్ము రేపుతుందని భావిస్తున్నాడు. ముఖ్యంగా మాస్ కి నచ్చే ఎలిమెంట్స్ అన్ని దర్శకుడు బోయపాటి కూర్చి ఈ కథను జన రంజకంగా తెరకెక్కించాడని టాక్.


మరో ప్రక్క ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'బాద్‌షా' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుంచి ఇటలీలో మొదలుకానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత బండ్ల గణేష్‌బాబు తెలియజేస్తూ' యాక్షన్‌తో అంశాలతో పాటు ఓ అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో వుంది. ఈ చిత్రంలో శ్రీనువైట్ల కొత్త ఎన్టీఆర్‌ను చూపించబోతున్నాడు. ఆయన ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే కథ. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇంతకు ముందు 'అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్‌తో అందర్ని నవ్వించిన ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X