జూ ఎన్టీఆర్...‘ఎవరి మాట వినడు’?

By Bojja Kumar

హైదరాబాద్ : మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజతో 'రేయ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి త్వరలో 'సీతయ్య'కు సీక్వెల్‌గా 'ఎవరి మాట వినడు', 'లాహిరి లాహరి లాహిరిలో'కి సీక్వెల్‌గా 'కృష్ణా ముకుందా మురారి' అనే చిత్రాలరు రూపొందించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీతయ్య సినిమాలో హీరోగా నటించిన నందమూరి హరికృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అప్పట్లో అదరగొట్టాడు. లాహిరి లాహిరి లాహిరిలో కూడా ఆయన పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఫలితంగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలను ఇచ్చింది.

తాజాగా సీతయ్యకు సీక్వెల్ తీస్తానని ప్రకటించడం వెనక అసలు కారణం....జూ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే ఉద్దేశ్యమే అని, హరికృష్ణ తనయుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ 'ఎవరి మాట వినడు' చిత్రంలో నటిస్తే మంచి ఫలితాలు వస్తాయని వైవిఎస్ భావిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే జూ ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ ఆయన నో చెబితే ఎవరితో ఆ సినిమా తీస్తారు? అనేది ఆసక్తికరమే.

ఈ చిత్రంతో పాటు 'లాహిరి లాహిరి లాహిరిలో'కి కొనసాగింపుగా 'కృష్ణా ముకుందా మురారి', 'థ్యాంక్స్‌ బేబి', 'సీఎం' - కామన్‌మేన్‌ అనే పేర్లతో చిత్రాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని ప్రకటించారు వైవిఎస్. ఈ నాలుగు చిత్రాల్లోని నటుల వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

ఇక ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్న 'రభస' చిత్రం చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ హీరోయిన్ సమంతే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X