»   »  శ్రీజ దంపతులకు క్లాస్ పీకిన జడ్జీ!!!

శ్రీజ దంపతులకు క్లాస్ పీకిన జడ్జీ!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu


మీరిద్దరు మేజర్స్ కదా...మీ తండ్రి ఆహ్వానించాలని ఎందుకు కోరుకుంటున్నారు..మీ జీవితం మీ ఇష్టం వచ్చినట్టు జీవించండి అంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీజ దంపతులకు క్లాస్ పీకాడు. అయినా తన తండ్రి ఆహ్వానించాలని కోర్టు బయటకు వచ్చిన తరువాత కూడా శ్రీజ దంపతులు పదేపదే మీడియాతో అనడం చూస్తుంటే శ్రీజ-శిరీష్ లు చిరంజీవి నుంచి ఏదో ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విషయాన్ని పదే పదే వారు డిమాండ్ చేయడం చూసి వీరి వెనకాల ఉన్న పెద్దలే ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ కొత్త దంపతులు అడిగేలా చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

శ్రీజ విషయంలో చిరంజీవి తొందరపడకుండా అడుగులు వేసి ఈ జంట వెనకాల ఉన్న పెద్దల యెత్తుగడలను చిత్తుచేయగలిగాడని అనుకుంటున్నారు. చిరంజీవికి వెనకాల కూడా సరైన సమర్థులే చేరారని భావిస్తున్నారు. దీనితో శ్రీజ-శిరీష్ వెనకాల ఉన్నవారు ఢంగైపోయినట్టు తెలుస్తోంది. చిరంజీవి కూతురును అడ్డంపెట్టుకొని చిరంజీవినే దెబ్బతీయాలని భావించిన వారి యెత్తుగడలు చిత్తయ్యాయని అనుకుంటున్నారు.

చిరంజీవికి ఇష్టంలేని పెళ్లిచేసుకొని రిసెప్షన్ పెట్టండి. ఫ్యామిలీ మీటింగ్ పెట్టండని ఏ మొహంపెట్టుకొని అడగగలుగుతున్నారని కూడా విశ్లేషకులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి తన కుటుంబంతో(మైనస్ శ్రీజ)సహా మళ్లీ విదేశాలకు వెళ్లినట్టు సమాచారం.

Read more about: srija sireesh bharadwaj
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X