'ట్రాఫిక్ సిగ్నల్' ఫ్రీమేక్?

By Staff

Traffic Signal
మధూర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ట్రాఫిక్ సిగ్నల్'(2007) సినిమా బాలీవుడ్ సినీ చరిత్రలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రం ముంబయిలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ చుట్టూ నడిచే ఈ కథ స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమా ఆ ట్రాఫిక్ సిగ్నల్ ను నమ్ముకుని ఎంతో మంది జీవించటం సవివరంగా చూపుతూ మనకు తెలియని (గమనించని) కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. కొంకణా సేన్ శర్మ,రణబీర్ షోరే ,నీతూ చంధ్ర ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ చిత్రంలో ముఖ్యంగా బిక్షగాళ్ళ మాఫియా మనని షాక్ కి గురిచేస్తుంది.

ఇక అసలు విషయంలోకి వస్తే ఈ సినిమా ఇప్పుడు మన తెలుగులోకి ఫ్రీమేక్ (రైట్స్ కొనకండా కాపీ) చేస్తున్నారని చెప్పుకుంటున్నారు .'జంక్షన్' పేరుతో తయారవుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గారబ్బాయి రవిబాబు హీరోగా నటిస్తూండటం విశేషం. అసాధ్యుడు ఫేమ్ అనీల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లియో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై బి.రామకృష్ణ నిర్మిస్తున్నారు. పరచూరి,నైనా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. జాన్ సొలొమెన్ సంగీతన్ని అందిస్తున్నాడు.రవిబాబు గతంలో ప్రేమఖైది,రౌడీ ఇన్స్ పెక్టర్ చిత్రాల్లో బాలనటుడుగా చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X