స్ట్రాటజీ మారింది.. రామ్ చరణ్‌తో సమంత పోటీ..

టాలీవుడ్‌లో బాక్సాఫీస్ పోరు అంటే.. టక్కుమని గుర్తుకు వచ్చేది సంక్రాంతి సినిమాలు. ఈ రేసులో టైర్ 2 హీరోలను పాన్ ఇండియా స్టార్ వరకు సంక్రాంతి బరిలో నిలుస్తారు. ఇప్పుడు అలాంటి బాక్సాఫీస్ పోరు జూన్ లో కూడా జరుగబోతుందట. ఈ నెలలో ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మధ్య పోటీ నెలకొనె అవకాశం ఉంది. వరుసగా వాయిదాలు పడిన 'పెద్ది' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ పోరుకు సిద్దంగా కాగా, మరోవైపు.. స్టార్ హీరోయిన్ సమంత .. తన 'మా ఇంటి బంగారం' సినిమాతో బరిలో దిగనున్నారట. ఇలా సమంత ప్లాన్ మార్చడానికి కారణమేంటీ? ఇంతకీ ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా విడుదల విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఈ సినిమాను మే 15న రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్, ప్రస్తుతం పరిస్థితులను అంచనా వేసుకుని సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా జూన్ 4న విడుదల చేయలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

June Box Office Clash Ram Charan s Peddi vs Samantha s Maa Inti Bangaram Buzz

ఈ నిర్ణయానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండియన్ ప్రీమిర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్. మే నెలలో ప్లే-ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు ఉండటంతో ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా క్రికెట్‌పైనే ఉండే అవకాశం ఉంది. దీంతో థియేటర్లలో కలెక్షన్లు ప్రభావితం కావచ్చని సినీ వర్గాల సూచించడంతో, సినిమా విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో జూన్ 4 తేదీకి మరో ప్రయోజనం కూడా కనిపిస్తోంది. యష్ నటించాల్సిన 'టాక్సిక్' సినిమా రేస్ నుంచి తప్పుకోవడంతో, ఆ డేట్ ఖాళీ అయ్యింది. దీంతో 'మా ఇంటి బంగారం'కు సోలో రిలీజ్ అవకాశాలు పెరిగాయి. పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండటం వలన ఈ తేదీని వ్యూహాత్మకంగా మారబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇదే సమయంలో మరో ట్విస్ట్ కూడా చర్చకు వస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా కూడా ముందుగా అనుకున్న తేదీ కంటే ముందుకు వచ్చి జూన్ మొదటి వారంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్. అదే జరిగితే, ఒకప్పుడు 'రంగస్థలం'లో కలిసి అలరించిన చరణ్-సమంత ఈసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ క్లాష్‌గా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో సమంత గృహిణిగా కనిపించనున్నారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రధానంగా ఉంటుంది. ఆమెతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.

ఇలా సరైన రిలీజ్ టైమింగ్ కోసం సమంత టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా వ్యూహాత్మకమేనని చెప్పాలి. ఐపీఎల్ హడావిడి తగ్గిన తర్వాత, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 'పెద్ది' కూడా అదే సమయానికి వస్తే, ఈ సమరం మరింత హాట్ టాపిక్‌గా మారడం ఖాయం. ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X