Jr NTR : ఓవైపు జూ ఎన్టీఆర్ సర్ ప్రైజ్.. మరోవైపు తారక్ షాకింగ్ డెసిషన్?
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ రేంజ్ లో కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర పార్ట్ : 1' వచ్చినా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. అభిమానులను ఖుషి చేసినా బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ రాబోయే చిత్రాలపై అభిమానులు ఆశలు పెంచుకుంటున్నారు. ఎలాగైనా ఇండియన్ ఫిల్మ్ రికార్డులను కొల్లగొట్టాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ కూడా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ను భారీ స్కేల్లోనే రూపొందింపజేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తారక్ నుంచి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది.... ఎన్టీఆర్ తన ప్రాజెక్ట్స్ ల్లో బిజీగా ఉంటూనే ఆయా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' చిత్రానికి వాయిస్ ఇచ్చి దుమ్ములేపాడు. ఎన్టీఆర్ బేస్ వాయిస్ విని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు విజయ్ దేవరకొండ అభిమానులు కూడా ఎంతో ఖుషి అయ్యారు. ఈ క్రమంలోనే మరోసారి తారక్ అన్న వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ లో దుమ్ములేపుతున్న 'ఛావా' చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛావా' చిత్రం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. శివాజీ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. కథనంతోపాటు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా అదరగొడుతోంది. కత్రినా కైఫ్ భర్త, బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్ - రష్మిక మందన్న కలిసి నటించిన ఈ చిత్రం హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు రూ.270 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ ఫ్యాన్స్ తెలుగు స్టేట్స్ లోనూ ఉండటంతో ఈ సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో 'ఛావా' మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లోనూ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారంట. అయితే శంభాజీ లాంటి పవర్ ఫుల్ పాత్రకు తెలుగులో వాయిస్ ఇవ్వమని గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను కోరారంట. తారక్ కూడా ఒప్పుకున్నారంటూ న్యూస్ అయితే ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అయితే.. ఎన్టీఆర్ కు భారీ ప్రాజెక్ట్స్ ఉండగా.. వాటన్నింటిని పక్కన పెట్టి ఈ చిత్రానికి వాయిస్ ఇవ్వాలనే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా? అది సాధ్యమయ్యే పనేనా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎన్టీఆర్ బేస్ వాయిస్, ఎమోషన్, డైలాగ్ డెలివరీ శంభాజీ పాత్రకు సరిగ్గా సరిపోతాయని అంటున్నారు. ఇక ఏమవుతుందో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ - నీల్ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. దాదాపు 3000 మంది ఆర్టిస్ట్ లతో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.


Click it and Unblock the Notifications











