‘దాన వీర సూర కర్ణ’పై కన్నేసిన ఎన్టీఆర్
ఊసరవెల్లి సినిమా మంచి హిట్ టాక్ రావడంతో పాటు, తొలి వారంలొ ఆశించిన దానికంటే ఎక్కువగానే వసూల్లు రాలుతుండటంతో కాస్త ఆనందంగానే ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. దూకుడు సినిమాను బీట్ చేసే స్పీడు లేక పోయినా గుడ్డిలో మెల్లలా గత డిజాస్టర్ శక్తితో పోల్చుకుంటే ఊసరవెల్లి జూనియర్ పరువు నిలబెట్టిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తను ఎప్పటి నుంచో కలలు గంటున్న తాత ఎన్టీఆర్ పౌరానికాల రీమేక్ లపై దృష్టి పెట్టాడు ఈ నందమూరి చిన్నోడు.
వివి వినాయక్ మహాభాతర గాథను బేస్ చేసుకుని ఓ పౌరానిక సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. వినాయక్ ప్రయత్నం అంతా జూనియర్ ఎన్టీఆర్ గురించే అనేది ఆయన సన్నిహితుల నుంచి అందిన సమాచారం. అలాంటి సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తేనే సినిమా ఆడుతుంది. తడబాటు లేని డైలాగ్ డెలివరీకితోడు, తాత ఎన్టీఆర్ వారసత్వం జూనియర్ సినిమాకు కలెక్షన్ల పరంగా కలిసొస్తుందనేది వినాయక్ ఆలోచనట. జూనియర్ కూడా తాత సినిమా రీమేక్ లలో నటించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. త్వరలో ఇద్దరి కాంబినేషన్ గతంలో వచ్చిన 'దాన వీర సూర కర్ణ" సినిమా రీమేక్ తెరకెక్కబోతోందనేది ఫిల్మ్ నగర్ టాక్. జూనియర్ ప్రతిపాదన మేరకే వివి వినాయక్ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాడని, త్వరలోనే ఇందుక సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











