Devara : జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్... ఆ 3 సెంటిమెంట్స్‌ను బ్రేక్ చేస్తేనే దేవర సక్సెస్?
RRR తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అయితే ముందుగా జరిగిన ప్రచారం ప్రకారమే ఈ సినిమా ఏప్రిల్ 5 నుంచి దసరా సీజన్‌కు పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడీ కొత్త రిలీజ్ డేట్ మూడు సవాళ్లను సినిమా ముందు నిలిచాయి. దీంతో అభిమానులంతా తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరి ఆ సవాళ్లను అధిగమించి సెంటిమెంట్‌ను తారక్ బ్రేక్ చేస్తారా? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆ ఛాలెంజెస్, సెంటిమెంట్స్ ఏంటి? అన్నది ఈ స్టోరీ చదివి తెలుసుకుందాం..
ఫుల్ మాస్ యాక్షన్‌గా ఎన్టీఆర్ నటించనున్న దేవర సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. సీ బ్యాక్‌డ్రాప్‌తో రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాకపోతే చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ మధ్య గాయపడ్డారు. మరి ఆయనకు సంబంధించిన షూట్ డిలే కావొచ్చు. అలాగే సంగీత దర్శకుడు అనిరూధ్ కూడా ఇంకా తన పనిని పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదని తెలుస్తోంది. మరో నాలుగు పాటల చిత్రీకరణ మిగిలి ఉందట.

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన ఫైట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలవనుందని చెబుతున్నారు. ఈ చిత్రంతోనే అలనాటి అందాల తార శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆమె పల్లెటూరి లుక్ కూడా బానే ఆకట్టుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, మలయాళ స్టార్ షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రం ముందు ఇప్పుడు మూడు సవాళ్లు నిలిచాయి. అదేంటంటే మొదటి రాజమౌళి సెంటిమెంట్. సాధారణంగా రాజమౌళి ఓ హీరోతో సినిమా చేస్తే అది భారీ హిట్ అవుతుంది. కాకపోతే ఆ సినిమా తర్వాత సదరు హీరో చేయబోయే సినిమా ఫ్లాప్‌గా నిలుస్తుందనే దానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ ఆచార్యతో భారీ డిజాస్టర్‌ను అందుకున్నారు. అంతకుముందు నితిన్, ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్ అందరూ ఈ బాధితులే. మరి ఇప్పుడు ఎన్టీఆర్ దేవరతో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా లేదా అనేది చూడాలి.

ఇకపోతే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా చేసిన ద్విపాత్రాభినయం సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. అంధ్రావాలా, శక్తి భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు దేవరలోనూ తారక్ తండ్రి పాత్రల్లో డ్యుయెల్ రోల్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంకా తారక్‌కు దసరా సీజన్ అసలు కలిసి రాదనే చెప్పాలి. ఆయన నటించిన పలు చిత్రాలు దసరా బరిలో దిగి బోల్తా కొట్టాయి.
రామయ్య వస్తావయ్యా, ఊసరవెళ్లి సహా పలు చిత్రాలు ఓపెనింగ్స్ భారీగానే ఉన్నా లాభాలను అందుకోలేకపోయాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అక్టోబర్ నెలలో వచ్చిన బృందావనం మాత్రం బాగానే హిట్ అయింది. ఫైనల్‌గా చూడాలి మరి ఈ మూడు సెంటిమెంట్స్‌ను తారక్ బ్రేక్ చేస్తారో లేదో..


Click it and Unblock the Notifications











