జూ ఎన్టీఆర్, ఇలియానాల మధ్య కోల్డ్ వార్ అప్పటినుంచే...!
'శక్తి" చిత్రాన్ని చూసినవారు అందులో ఎన్టీఆర్, ఇలియానాల ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ చాలా బాగుందని చెప్పుకున్నారు. కానీ తెర వెనుక మాత్రం ఈ ఇద్దరికీ మధ్య అంతగా సఖ్యత లేదనే వార్తలు బయటికొస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇలియానా తన వాన్ లో కూర్చునేదట. సీన్ తీసేటప్పుడు మాత్రమే అందులోంచి బయటికొచ్చేదని, ఇలియానా, ఎన్టీఆర్ అంత ఫ్రెండ్లీ గా ఉండేవారు కాదని వినికిడి ఈ వార్థల్లో ఎంతవరకు నిజం ఉందో చెప్పలేం కానీ ఇటీవల 'శక్తి" గురించి ఇలియానా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్టీఆర్ ని ఆగ్రహానికి గురి చేశాయని సమాచారం.
అయితే 2006 లో 'రాఖీ" సినిమాలో ఆల్రెడీ జూ ఎన్టీఆర్ సరసన నటించిన ఇలియానా, దాని తర్వాత జూ ఎన్టీఆర్ ని అవాయిడ్ చేసింది. అయితే అశ్వినీదత్ తన మనసును మార్చి తనే 'శక్తి"లో అవకాశాన్ని ఇచ్చాడని, అయితే ఇలియానా మాత్రం అయిష్టంగానే శక్తిలో నటించిందని సమాచారం. అందుకే కాబోలు ఇలియానా సినిమా రిలీజయ్యాక చిత్రం గురించి చాలా నీచంగా మాట్లాడింది. ఆ సినిమా ప్రమోషన్ కి రావటం ఇష్టం లేదని,తనకు ఒకటి చెప్పి మరొకటి తీసారని, చాలా దారుణంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత సినిమా రిలీజై వారం కూడా కాకముందే ఇలియానా ఇలా మాట్లాడటం ఎన్టీఆర్ కు చాలా కోపం తెప్పించిందని ఆమెను ఇక తన సినిమాల్లో తీసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో కొద్ది రోజలు గుసగుసలు వినిపించాయి. .అలాగే అశ్వనీదత్ ని ఆమెపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కేసు పెట్టమని కూడా పురమాయించాడని తెలిసింది. ఇలియానా చేసింది ఎలా ఉన్నా ఎన్టీఆర్ బాధపడటం లో న్యాయం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











