ఏంటి.. 'గుంటూరు కారం' ఫస్ట్ ఛాయిస్ మహేశ్ కాదా?.. ఆ హీరో నుంచి సూపర్ స్టార్ చేతికి ఎలా వచ్చిందంటే??
'గుంటూరు కారం'.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఈ సినిమా ఏ ముహుర్తాన మొదలు పెట్టారో కానీ అన్నీ అడ్డంకులే. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ నిరుత్సాహంలో కూరుకుపోతూ.. మూవీటీమ్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటున్నారు. అయితే తాజాగా తెలిసిన వార్త ఏంటంటే అసలీ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మహేశ్ కాదట. ఇంతకీ మొదట ఎవరిని హీరోగా అనుకున్నారంటే..
త్రివిక్రమ్ - మహేశ్.. ఈ కాంబో గురించి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజ' చిత్రాలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 'అతడు' చిత్రం కథ నచ్చడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. 'ఖలేజా' కమర్షియల్ గా ఆడకపోయినా.. ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ పై బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ కాంబో ఎప్పుడైతే ప్రకటించారో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

వరుసగా ఆటంకాలు: అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయమే తీసుకుంది. సరే తీసుకున్న తర్వాత అయినా అంతా సవ్యంగా సాగి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. కథలో మార్పులు, షూటింగ్ షెడ్యూల్ పోస్ట్ పోన్, మెయిన్ హీరోయిన్ తప్పుకోవడం, చిత్రీకరించిన సన్నివేశాలు పక్కనపెట్టేయడం, కొరియోగ్రాఫర్ ను మార్చడం.. అబ్బో చాలానే జరిగాయి. దీంతో సూపర్ స్టార్ అభిమానులకు తెగ కోపం వచ్చేసింది. అసలీ సినిమా పూర్తవుతుందా?, మహేశ్ ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడురా బాబు! అనే స్టేజ్ కు వచ్చేశారు.

ఫస్ట్ ఛాయిస్ మహేశ్ కాదట: ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ జరగట్లేదని తెలిసింది. మహేశ్ ఫ్యామిలీతో పాటు కలిసి ఫారెన్ టూర్ వెళ్లిపోయారు. అయితే తాజాగా ఓ కొత్త వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అసలు 'గుంటూరు కారం' సినిమాలో హీరోగా మహేశ్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదట.
జూనియర్ ఎన్టీఆర్ కోసం ఈ కథ రాసుకున్నారట. యంగ్ టైగర్ ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ కథ రాయడమే కాకుండా.. టెక్నీషియన్స్ ను కూడా అలాగే తీసుకున్నారట. కానీ ఎన్టీఆర్.. కొరటాల శివ సినిమాతో బాగా బిజీగా ఉండటం వల్ల.. తప్పనిసరి పరిస్థితుల్లో హీరోగా మహేశ్‌ను తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.

అందుకే అన్నీ మార్పులు: అందుకే మాస్ హీరో కోసం రాసిన కథలో క్లాస్ హీరోను తీసుకోవడం వల్ల..కథలో మార్పులు చేసి టెక్నీషియన్స్, నటీనటులను మార్చాల్సి వచ్చిందని తెలిసింది. అందుకే ఈ సినిమా అన్ని అడ్డంకులు ఎదుర్కొంటుంది, షూటింగ్ వాయిదా పడుతూ వస్తుందని అంతా చెబుతున్నారు. సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అలా సమస్యలు మొదలు: మొదట యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను మార్చడంతో మొదలైన ఈ అడ్డంకులు.. ఆ తర్వాత కథలో మార్పులు, హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకోవడం, సెకండ్ హీరోయిన్ కోసం వెతుకులాటలు, అందుబాటులో ఉన్న శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేయడం, ఇప్పుడేమో మ్యూజిక్ ట్రాక్స్ నచ్చలేదంటూ తమన్ తప్పించారంటూ వార్తలు రావడం జరుగుతున్నాయి. మొత్తంగా ఓ హీరో కోసం రాసుకున్న కథలో మరో హీరో ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ చిత్రం ఎన్నో టర్నింగ్‌లు తీసుకుంటూ ముందుకెళ్తుంది..


Click it and Unblock the Notifications











