Devara: ఎన్టీఆర్ దేవరలో నేచురల్ హీరోయిన్.. జాన్వీకి పోటీగా భలే బ్యూటీని పట్టారే?
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గేమ్ ఛెేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక తారక్.. కొరటాల శివతో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అనుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ హీరోయిన్ గా పోటీగా మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసిందట చిత్ర బృందం. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవర పార్ట్ వన్. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ సరనన హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ క్రియేషన్స్ బ్యానర్స్ పై హీరో కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా గురించి ఇటీవల కల్యాణ్ రామ్.. దేవర సినిమా అప్డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్లో ఎటువంటి మార్పు లేదని.. తెలుగు సినిమా చరిత్రలోనే ఎన్నడూ చూడని విజువల్ ట్రీట్ దేవరలోఉంటుందని చెప్పుకువచ్చారు. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయని తెలిపారు. త్వరలో దేవర నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయని చెప్పుకువచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సెకండ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా అలియా భట్, దీపికా పదుకునే, రష్మిక మందన్నా పేర్లు వినిపించాయి. తాజాగా దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ ఫైనలైజ్ అయినట్లు నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకారం... సెకండ్ హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.
కొరటాల శివ.. ఈ ముద్దుగుమ్మను సినిమాలో హీరోయిన్ గా చేస్తే.. బాగుంటుందని భావించారట. ఒక నేచురల్ క్యారెక్టర్ కోసం సాయి పల్లవి అయితేనే కరెక్ట్ అని భావించినట్లు తెలుస్తోంది. ఇక ఈభామ నేచురల్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. అందులోనూ ట్రెడిషనల్ గా ఉంటుంది. మరి ఈ పాన్ ఇండియా సినిమాలో సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ న్యూస్ వైరల్ గా మారింది.

ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తుంది. ఈ భామ ఎక్స్ పోజింగ్ ఉండే క్యారెక్టర్స్ కంటే.. తనకు మంచి పేరును ఇచ్చే వాటిని మాత్రమే ఎన్నుకుంటుంది. ఇక ఎన్టీఆర్ సరనస సాయి పల్లవి యాక్ట్ చేస్తే.. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వీరి జోడి సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉండనుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











