KGF దర్శకుడితో తారక్ మరోసారి సిట్టింగ్.. కోపంతో ఒకేసారి రెండు ప్రాజెక్టులు?
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తారక్ తన సినీ కెరీర్ లో మునుపెన్నడు లేని విధంగా చాలా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. గతంలో సాధారణంగా ఈ స్టార్ హీరో ఒక ఏడాదిలో మినిమమ్ ఒక సినిమాను విడుదల చేయాలని అనుకునేవారు. కానీ ఈ సారి మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. దానికి తోడు కరోనా కూడా ఇబ్బంది పెడుతోంది.

వెండితెరకు లాంగ్ గ్యాప్
రాజమౌళి డెడికేషన్ ప్లస్ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇవ్వాల్సి వస్తోంది. అసలైతే మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం RRR షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ రాజమౌళి వర్క్ గురించి ముందే అందరూ ఊహించారు. అంతే కాకుండా కరోనా కూడా ఇబ్బంది పెడుతోంది. మొత్తంగా ఈ మల్టీస్టారర్ సినిమా వచ్చే ఏడాదికి సమ్మర్ కి రావడం కూడా అనుమానంగానే ఉంది.

అసంతృప్తిలో ఎన్టీఆర్
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ లాంగ్ గ్యాప్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. RRR తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు ఆ సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు.

ఒకేసారి రెండు ప్రాజెక్టులు
ఇక ఆ సినిమా తరువాత తారక్ KGF డైరెక్టర్ తో ఒక సినిమాను చేయాలని అనుకుంటున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లోనే ఆ సినిమా భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

దర్శకుడితో సిట్టింగ్
క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటే మాత్రం ఒక దాని తరువాత మరొకటి చేయాల్సి ఉంటుంది. మరి ఆ విషయంపై తారక్ ఏ విధంగా ప్రణాళికలు రచిస్తాడో చూడాలి. త్రివిక్రమ్ అయితే వీలైనంత తొందరగా సినిమాను ఫినిష్ చేయాలని చూస్తారు. అందుకే ఎక్కువ శాతం ఆయన సినిమాను ముందుగా పూర్తి చేసి ఆ తరువాత ప్రశాంత్ ప్రాజెక్టుతో బిజీ అయ్యే ఛాన్స్ ఉందట. ఇక రీసెంట్ గా ఈ విషయంపై దర్శకుడితో సిట్టింగ్ వేసి చర్చలు జారిపినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











