బాలీవుడ్‌కు షాకివ్వబోతున్న ఎన్టీఆర్.. పకడ్బందీగా తారక్ ప్లాన్

గ్లోబల్ స్టార్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నుంచి అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కే సైన్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ వరుసలో ఇప్పటికే దేవర చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రానికి ఆశించిన మేర ఫలితం అందలేదు. ఇక దీంతో తన రాబోయే ప్రాజెక్ట్స్ పై మరింతగా ఫోకస్ పెట్టారు తారక్. కాగా ఇప్పటికే పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, నెక్ట్స్ మాటల మాంత్రికుడు, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరో చిత్రం చేయబోతున్నారు. ఈ సినిమాతో భారీ సెన్సేషన్ కు సిద్ధమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా..
ఇప్పటికే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కంటే ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఇప్పుడు మరోసారి రీయూనియన్ అయ్యారు. త్రివిక్రమ్ - జూ.ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోయే చిత్రం మైథలాజికల్ జోనర్ లో ఉండటం విశేషం. భగవంతుడు కార్తీకేయ ఆధారిత కథతో చిత్రం రూపుదిద్దుకోనుండటం విశేషం.

Junior NTR Planning big with Trivikram

నాగ వంశీ నిర్మాతగా..
ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కథకు తగ్గట్టుగా ఎన్టీఆర్ తనను తాను ప్రీపేర్ చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్, భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లతో రూపొందించబోతుండటం విశేషం. ఇక భారీ విజువల్స్ తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నామని నాగవంశీ హామీనిస్తున్నారు.

నాగ వంశీ కామెంట్స్..
రీసెంట్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ త్రివిక్రమ్ శ్రీనివాస్ - జూనియర్ ఎన్టీఆర్ చిత్రంపై ఇలా మాట్లాడారు. ఈ చిత్రం ప్రారంభానికి ముందే, లాంఛింగ్ వరకు భారీ హైప్ వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని, అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఈ సినిమా బాలీవుడ్ లోని హిందీ రామాయణ సినిమాను మించి ఉంటుందని ఇప్పటికే త్రివిక్రమ్ తనతో చెప్పారని నాగవంశీ వ్యాఖ్యానించారు. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే దుమ్ములేపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. పైగా హిందూ మైథలాజికల్ స్టోరీ, త్రివిక్రమ్ డైరెక్షన్ కావడంతో ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ లో ఈ చిత్రం సంచలనంగా మారుతుందని అభిప్రాయ పడ్డారు.

రాబోయే చిత్రాలివే..
ఆర్ఆర్ఆర్, దేవర వంటి భారీ చిత్రాల తర్వాత జూనియర్ నటించిన భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించారు. విలన్ గా ఎన్టీఆర్ అలరించబోతున్నారు. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Read more about: junior ntr trivikram naga vamsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X