Don't Miss!
- News
మనీశ్ సిసోడియా ఇళ్లలో సోదాలు పూర్తి.. ఆర్టికల్‌పై కామెంట్ప్‌పై న్యూయార్క్ టైమ్స్ గుర్రు
- Sports
World Test championship: ఇంగ్లాండ్‌పై గెలుపుతో అగ్రస్థానంలో సౌతాఫ్రికా.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే?
- Technology
త్వరలో భారత్‌లోకి 180W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా గల మొబైల్!
- Lifestyle
Health Tips: Healthy Fatty Foods:ఈ కొవ్వు పదార్ధాలు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, గుండెపోటును నివారిస్తాయి..
- Finance
Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు
- Automobiles
కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?
- Travel
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
అన్న సినిమా కోసం రంగంలోకి ఎన్టీఆర్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే?
ఎన్టీఆర్ తన కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు తన సోదరులు అన్నా తన కుటుంబం అన్నా ఎంతో ప్రేమ. అందుకే ఓకే తనకు స్టార్డమ్ వచ్చాక కూడా తాను సొంతంగా ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించుకోకుండా అన్న నిర్మాణ సంస్థ తోనే జర్నీ కొనసాగిస్తున్నాడు. తాజాగా అన్న కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ మరో పని చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

హిట్ సినిమా కోసం
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా సంవత్సరాలుగా సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పటాస్ సినిమా తర్వాత ఆయనకు సరైన హిట్ సినిమా దక్కలేదు.. మధ్యలో కొన్ని సినిమాలు చేశారు కానీ అవి ఏవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అందుకే ఎలా అయినా ప్రేక్షకులను మెప్పించే సినిమా చేయాలని ఆయన బింబిసార అనే సినిమా చేస్తున్నాడు.

పవర్ఫుల్ లుక్ లో
ఈ సినిమా టైటిల్ మాత్రమే కాక ఈ టైటిల్ రివీల్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేసిన వీడియో కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచింది.. బాహుబలి రూపంలో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ కాస్త కొత్తగా కనిపిస్తున్నాడనే చెప్పాలి. శత్రువులను చంపి వారి శవాలను గుట్టగా పేర్చి వాటి మీద కూర్చుని పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. ఎ టైం ట్రావెల్ ఫ్రొం ఈవిల్ టు గుడ్ అనే ఈవిల్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

కొత్త దర్శకుడు
ఈ సినిమా పూర్తిగా పౌరాణిక అంశాలతో కూడి ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చేందుకు గాను ఈ సినిమా కోసం ఎన్టీఆర్ క్రేజ్ ను వాడుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అన్న కోసం తమ్ముడు
ఈ మధ్య కాలంలో ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇస్తున్న దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్న సినిమా కోసం ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ వాయిస్ సినిమాకి బాగా ప్లస్సవుతుందని సినిమా దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. మామూలుగానే ఎన్టీఆర్ గొంతు గంభీరంగా ఉంటుంది అదీగాక ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్న సమయంలో అయితే సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావడం ఖాయం అని అంటున్నారు. ఫ్యాన్స్ కి అయితే పూనకాలే అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

మార్కెట్ కూడా
ఎన్టీఆర్ చేత ఈ పని చేయిస్తే సినిమా మీద అంచనాలు పెరగడమే కాక కచ్చితంగా సినిమా మార్కెట్ కూడా పెరుగుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇక మరో పక్క ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.