twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జస్టిస్ ఫర్ కొరటాల శివ.. శివను ఎందుకు బలి చేస్తున్నారంటూ ట్రెండ్.. అసలు విషయం ఏమిటంటే?

    |

    ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల శివ ఇబ్బందుల్లో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సినిమాకు దర్శకుడు అయిన కొరటాల శివ ఆచార్య డిస్ట్రిబ్యూటర్స్ వ్యవహారంలో ఎందుకు సెటిల్మెంట్ చేస్తున్నారనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అది ఏమిటంటే సినిమా డిస్ట్రిబ్యూటర్ల సెటిల్మెంట్ చేయడం కోసం హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రాంతంలో ఉన్న తన స్థలాన్ని కూడా అమ్మడానికి కొరటాల శివ సిద్ధమయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

     ప్లాట్ అమ్మడానికి

    ప్లాట్ అమ్మడానికి

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో పూజ హెగ్డే ఆయన సరసన నటించిన సినిమా ఆచార్య. భరత్ అనే నేను సినిమా చేసి చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత కొరటాల శివ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. తొలుత ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి అలాగే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్ నిర్మిస్తారని ప్రచారం జరిగింది. అయితే సినిమా కరోనా కారణంగా చాలా ఆలస్యం కావడంతో అనేక మార్పులు చేర్పులు కూడా చేసుకున్నాయని అంటునారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు కొరటాల శివ ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లతో సెటిల్మెంట్ చేసుకోవడం కోసం తాను కష్టపడి కొనుక్కున్న ఒక ప్లాట్ అమ్మడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.

    ఇబ్బంది పెట్టకుండా

    ఇబ్బంది పెట్టకుండా

    దాని విలువ 40 నుంచి 45 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్ చేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జస్టిస్ ఫర్ కొరటాల శివ అనే ట్రెండ్ జరుగుతోంది. దర్శకుడు ఎందుకు సెటిల్మెంట్ చేయాల్సి వస్తోంది. నిర్మాతలు, హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ అలాగే నిరంజన్ రెడ్డి ఎందుకు ఈ విషయాలు పట్టించుకోవడం లేదు కొరటాల శివను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది అని అంటున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    నాలుగు కోట్ల రూపాయలు అదనంగా

    నాలుగు కోట్ల రూపాయలు అదనంగా

    అయితే అసలు సమాచారం ఏమిటంటే ఈ సినిమాకు రామ్ చరణ్ తేజ, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పేరు మాత్రమే వేశారని, రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు రెమ్యూనరేషన్లు సినిమాలో పెట్టుబడిగా సినిమా ప్లాన్ చేశారని అంటున్నారు. వీరిద్దరూ కలిసి 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవాల్సి ఉంది. మిగతా డబ్బు అంతా నిరంజన్ రెడ్డి స్వయంగా పెట్టి నిర్మించారు. సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల అవుతుంది అనుకున్న సమయంలో కొరటాల శివ నిరంజన్ రెడ్డి పెట్టిన డబ్బులు మీద నాలుగు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ఈ సినిమా బిజినెస్ మొత్తం తానే చూసుకుంటానని తనకు వదిలేయాల్సిందిగా కోరారు అనే ప్రచారం ఉంది.

    సెటిల్ చేయడమే కాక

    సెటిల్ చేయడమే కాక

    దీంతో నిరంజన్ రెడ్డి నాలుగు కోట్ల లాభం వచ్చింది కాబట్టి సైడ్ అయిపోయారని, కాకపోతే ఈ విషయాలు బయటకు రానీయకుండా తానే నిర్మాత అంటూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు. నిరంజన్ రెడ్డి స్వయంగా తప్పుకున్నారు కాబట్టి చిరంజీవి, రామ్ చరణ్ కూడా తమ నిర్మాణ వాటాల కిందట తమ రెమ్యునరేషన్లు పెట్టారు కాబట్టి 50 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరారట. దీంతో కొరటాల శివ తాను సంపాదించిన డబ్బు అంతా పెట్టి ఒకపక్క నిరంజన్ రెడ్డికి సెటిల్ చేయడమే కాక మరోపక్క రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరికీ కలిపి 30 కోట్ల రూపాయలు ఇచ్చారట.

    జస్టిస్ ఫర్ కొరటాల శివ

    జస్టిస్ ఫర్ కొరటాల శివ

    ఇప్పుడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది కాబట్టి మరో 20 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదని చిరంజీవి రామ్ చరణ్ ఆయనకు సాయం చేశారట. కానీ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు వ్యవహారానికి వస్తే కొన్ని చోట్ల భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొరటాల శివ కొంత సాయం చేశారని తెలుసుకున్న ఇతర ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ సంగతి ఏంటి అంటూ ఆయన ఆఫీస్ మీదకు వెళ్లి బయట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో కొరటాల శివ ఆఫీస్ ముందు బయర్లు బైఠాయించారు అనే వార్తలు బయటకు రావడంతో ఇప్పుడు కొత్తగా ఈ జస్టిస్ ఫర్ కొరటాల శివ ట్రెండ్ అవుతుంది.

    English summary
    Justice for koratala siva trend going viral on social media here is the in side story what happened.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X