»   » పూరీ జగన్నాథ్ మామూలోడు కాదు

పూరీ జగన్నాథ్ మామూలోడు కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ అంటే స్పీడుగా సినిమాలు చేయటంలో దిట్ట. సినిమా గ్లామర్,గ్రామర్ స్పష్టంగా తెలిసిన వ్యక్తి కావటంతో స్టార్ హీరోల సినిమాలు సైతం రికార్డు సమయంలో ఫినిష్ చేసి తన నిర్మాతలకు ఆనందాన్ని మిగులుస్తూంటాడు. ఇప్పుడు మరో సారి అంతకన్నా స్పీడుగా అలాంటి పీట్ చేసారని సమాచారం. మార్చి 8న ఉమెన్స్ డే రోజున ఆయన టెంపర్ తర్వాత ఆయన ఛార్మి ప్రధాన పాత్రలో జ్యోతి లక్ష్మి చిత్రం ఎనౌన్స్ చేసారు. అప్పుడే ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైపోయినట్లు సమాచారం. కేవలం హైదరాబాద్ లో ఏడు రోజులు షూటింగ్ మినహా చిత్రం ఫినిష్ చేసేసాడని తెలుస్తోంది. సినిమా మొత్తం గోవా లో తీసినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రంలో ఛార్మీ సెక్స్ వర్కర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఛార్మీ గతంలో ప్రేమే ఒక మైకం చిత్రంలో సెక్స్ వర్కర్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.ఆ చిత్రం మరేదో కాదు జ్యోతి లక్ష్మి. ఈ చిత్రం అందరూ అనుకుంటున్నట్లు హీరోయిన్ జీవితం కాదు..ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ అని తెలుస్తోంది. అది మల్లాది వెంకట కృష్ణమూర్తి రచన మిసెస్ పరాంకుసం నవల ఆధారంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Jyothi Lakshmi - Only 7 Days To Finish

అందులో పరాంకుసం అనే వేశ్య...వివాహం చేసుకుని అందరిలా వైవాహిక జీవితం గడుపుతూ ఎలా సెటిలైందనే అంశం చుట్టూ తిరిగుతుంది. దాన్నే కొద్ది పాటి మార్పులతో పూరి చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న జ్యోతిలక్ష్మి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్. జూనియ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్ సినిమా పూర్త‌వ‌టంతో త‌న భ‌విష్య‌త్ సినిమాల ప‌నిలో ప‌డిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ తెలిపాడు. త‌ను ఛార్మీ తో తీయ‌బోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్ల‌డించాడు.

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.

English summary
During Women’s Day even on March 8th, Puri announced this next flick, women centric “Jyothi Lakshmi” Charmi Kaur in the lead, will go on floors. Surprisingly there is only 7 days of shooting left for Jyothi Lakshmi to be shot in Hyderabad and the film will release in May ending.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu