కె. రాఘవేంద్రరావు నెక్ట్స్ చిత్రం డిటేల్స్
రీసెంట్ గా 'ఝుమ్మంది నాదం' చిత్రంతో పలకరించిన సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారని సమాచారం. 'ఇంటింటా అన్నమయ్య' అనే టైటిల్ తో ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. యు.ఎస్.ఎ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ జరగనుంది. ఓ స్టార్ హీరో ఈ చిత్రంలో చేయనున్నారు. భక్తి రస ప్రధానంగా సాగే ఓ సాఘిక చిత్రం అని తెలుస్తోంది. ఇక 'ఝుమ్మంది నాదం' శృతిమించిన శృంగారం వర్కవుట్ కాలేదని చూసినవాళ్ళు అంటున్నారు. కేవలం తాప్సీ అందాలు చూడ్డానికి మాత్రమే వెళ్ళాలని అంటున్నారు. ఈ నేపధ్యంలో తనకు ఈ మధ్య కాలంలో బాగా అచ్చివచ్చిన భక్తి రసమే మేలనే నిర్ణయానికి వచ్చే ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు.
కె రాఘవేంద్రరావు తాప్సీ మోహన్ బాబు లక్ష్మీ ప్రసన్న ఝుమ్మంది నాదం laxmi prasanna k raghavendra rao tapsi jhummandi naadam


Click it and Unblock the Notifications