దర్శకేంద్రుడి మదిలో అన్ని అలోచనలా... గట్టిగా కొట్టేందుకు భారీ ప్లాన్!!

దర్శకుడు కే రాఘవేంద్రరావు క్రియేట్ చేసిన మాయాజాలాన్ని, అతని అద్భుత సృష్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వెండితెరను ఓ మలుపు తిప్పిన దిగ్గజ దర్శకుడు ఎన్టీఆర్ వంటి హీరోతో మాస్ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేసేలా సినిమాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో నవశకానికి నాంది వేశాడు. తెలుగు చిత్రసీమలో టాప్ హీరోలందరితో పని చేసి అందరికీ మరుపురాని చిత్రాలు ఇచ్చిన దర్శకులు అతి కొంతమందే ఉంటారు. అందులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకరు.

 అప్పట్లో సంచలనాలు..

అప్పట్లో సంచలనాలు..

రాఘవేంద్రరావు చిత్రాలకు ప్రత్యేకంగా ఓ ముద్ర ఉంటుంది. ఒక్క ఫ్రేమ్‌ను చూసినా సరే అది రాఘవేంద్రరావు సినిమా అని ఇట్టే గుర్తు పట్టొచ్చు. స్క్రీన్ అంతా రంగులతో నిండి కలర్ ఫుల్‌గా ఉందంటే అది కచ్చితంగా రాఘవేంద్రరావు చిత్రమే అయి ఉంటుంది. అలా దర్శకేంద్రుడు 80, 90వ దశకంలో టాప్ డైరెక్టర్‌గా యమా బిజీగా ఉన్నారు.

 ఫలించని మాయాజాలం..

ఫలించని మాయాజాలం..

అయితే ఈ మధ్య కాలంలో రాఘవేంద్రరావు మాయాజాలం అంతగా పని చేయడం లేదు. చివరగా శ్రీరామదాసు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు తీసిని సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు. చివరగా నమో వేంకటేశాయ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అన్నమయ్య సినిమా హిట్ అయిన సెంటిమెంట్‌తో ఓం నమో వేంకటేశాయ హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ అది కూడా బోల్తా కొట్టింది.

లాంగ్ గ్యాప్..

లాంగ్ గ్యాప్..

ఆ సినిమా తరువాత రాఘవేంద్రరావు సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చాడు. ఇకపై చిత్రాలను తీయకూడదని అనుకున్నాడట. కెరీర్‌కు ముగింపు పలకాలని అనుకున్నాడట. కానీ ఇలాంటి కెరీర్‌ను ముగించే ముందు మంచి హిట్ కొట్టాలనే కోరికతో ఉన్నాడట. అందుకే మళ్లీ ఓ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనతో పెళ్లి సందడి సీక్వెల్‌ను ప్లాన్ చేశాడట.

చివర్లో మార్పులు..

చివర్లో మార్పులు..

మొదటగా దర్శకత్వం చేయబోతోన్న అంటూ ప్రకటించారు. కానీ తీరా చూస్తే దర్శకత్వ పర్యవేక్షణ అనే కార్డుతో సరిపెట్టుకున్నాడు. కానీ దర్శకేంద్రుడి మదిలో మాత్రం ఓ స్టార్ హీరోతో ఓ సినిమా తీసి సాలిడ్ హిట్ కొట్టి సగర్వంగా కెరీర్‌ను ముగించాలని ఫిక్స్ అయ్యాడట. మరి దర్శకేంద్రుడు కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X