'నువ్వే కావాలి' కె విజయ్ బాస్కర్ కొత్త చిత్రం 'ప్రేమ కావలి'
నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లేశ్వరి వంటి హిట్ చిత్రాలను అందించిన కె.విజయ్ బాస్కర్ ఆ తర్వాత భలే దొంగలు వంటి ప్లాప్ చిత్రాన్ని సైతం అందించారు. ఇప్పుడు తాజాగా ప్రేమే కావాలి అనే చిత్రంతో మళ్ళీ లైమ్ లైట్ లోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. సాయకుమార్ కుమారుడు ఆదిని ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నారు. అలాగే ఇషా ఛావ్లా అనే బాలీవుడ్ భామ సైతం ఈ చిత్రంతో తెరంగ్రేటం చేస్తోంది. ఇక విజయ్ భాస్కర్ ఈ చిత్రానికి తెలుగు పరిశ్రమలో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే ఛోటా కె. నాయుడుని కెమెరామెన్ గా తీసుకున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతోనైనా విజయ్ భాస్కర్ విజయం సాధించి మళ్ళీ కంటిన్యూ అవుతాడని ఆశిద్దాం.
సాయికుమార్ ఆది కిక్ నువ్వు నాకు నచ్చావ్ మన్మథుడు మల్లీశ్వరి విజయ్ భాస్కర్ స్వయంవరం నువ్వే కావాలి saikumar vijaya bhaskar swayamvaram manmadhudu malleswari


Click it and Unblock the Notifications