కె విశ్వనాథ్ ఏ డైరక్టర్ ని టార్గెట్ చేసి మాట్లాడారు

By Sindhu

కళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. ఆయన తీసే సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. విశ్వనాథ్ చిత్రాలంటే అన్ని వర్గాలవారు చూస్తారు. తెలుగు సినిమా ప్రతిష్టను దశదిశలా చాటిన దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్‌. తెలుగువారు గర్వంగా చెప్పు కునే 'శంకరాభరణం', 'సాగరసంమం', 'స్వాతిముత్యం', 'స్వర్ణకమలం', 'స్వయంకృషి', 'శుభలేఖ' వంటి ఎన్నో కళాత్మక చిత్రాలను ఆయన అందించారు.

కళాతపస్వి కె. విశ్వనాథ్ ప్రస్తుతం అల్లరి నరేష్, మంజరి, జంటగా 'శుభప్రదం" చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. నేటి తరం చిత్రాల గురించి ఆయన మాట్లాడుతూ 'నేటి తరం సినిమాలు జనాలకు నేర్పించే విధంగా లేవు. అమ్మాయిలను ఎలా ఏడిపించాలి? అబ్బాయిలు ఎలా ఆకతాయితనంగా ఉండాలి? అనే తరహా కథలతో చాలా సినిమాలు రూపొందుతున్నాయి. వీటివల్ల జనాలకు ఏం ఉపయోగం ఉంటుంది? అని విశ్వనాథ్ అంటున్నారు. ఇంతకీ విశ్వనాథ్ ఏ దర్శకుడిని టార్గెట్ చేసుకుని ఇలా మాట్లాడారో..?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X