యువ హీరోయిన్‌తో డేటింగ్ రూమర్లు.. ప్రియురాలితో క్లోజ్‌‌గా కాలభైరవ

టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హడావుడి కనిపిస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటలు సుధీర్ఘకాలంగా సాగుతున్న తమ ప్రేమాయణానికి తెరదించి గత నెలలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఆ తర్వాత వారం తిరిగేసరికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఇప్పటికీ సీక్రెట్‌గా ప్రేమాయణాన్ని సాగిస్తున్న జంటలు చాలానే ఉన్నాయి.

గత కొద్దిరోజులుగా ఒక జంట టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ.. బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్‌లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని, త్వరలోనే వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటిని కావ్య కానీ, కాలభైరవ కానీ.. వీరి కుటుంబ సభ్యులు కానీ ఖండించలేదు. తాజాగా వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Kaala bhairava and Kavya Kalyanram Spark Dating Rumors with Close Appearance at Event

కావ్య కళ్యాణ్‌రామ్ విషయానికి వస్తే.. బాలనటిగా స్నేహమంటే ఇదేరా, గంగోత్రి, ఠాగూర్, అడవి రాముడు, లేత మనసులు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, పాండురంగడు, ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రాలలో నటించింది. మసూదతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు బలగం మూవీ బ్రేక్ ఇచ్చింది. అనంతరం ఉస్తాద్ మూవీలో నటించినా అది ఆశించిన విజయం సాధించాలేదు. దాదాపు మూడేళ్లుగా ఖాళీగానే ఉన్న కావ్య.. ప్రస్తుతం వాట్సాప్ నరేష్ అనే మూవీలో నటిస్తోంది.

అటు కాలభైరవ తన తండ్రి కీరవాణి అడుగుజాడల్లో సంగీతం వైపే నడిచారు. రాజన్న సినిమా ద్వారా ప్లేబ్యాక్ సింగర్‌గా అడుగుపెట్టిన కాలభైరవ స్టార్ సింగర్‌గా ఎదిగారు. బాహుబలి 2, మళ్లీ రావా, రంగుల రాట్నం, కిర్రాక్ పార్టీ, అరవింద సమేత వీరరాఘవ, ఎన్టీఆర్ కథానాయకుడు, మిస్టర్ మజ్ను, జెర్సీ, కలర్ ఫోటో, ఆర్ఆర్ఆర్ సినిమాలలో కాలభైరవ పాడిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక మత్తువదలరా సినిమాతో సంగీత దర్శకుడిగానూ మారారు. ఆ తర్వాత కలర్ ఫోటో, తెల్లారితే గురువారం, మోగ్లీ సినిమాలకు సంగీతం అందించారు. 2023లో 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో నాటు నాటు సాంగ్‌కు రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ చేసే అరుదైన ఘనత సాధించాడు.

కాగా.. గత కొంతకాలంగా కావ్య- కాలభైరవలు ప్రేమించుకుంటున్నారని టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా గాసిప్స్ వచ్చాయి. త్వరలోనే వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన వెలువడనుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఇరువర్గాలు ఇంత వరకు స్పందించలేదు. ఈ రూమర్స్ వేళ... కావ్య- కాలభైరవలు షాకిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ బుక్ లాంచ్ కార్యక్రమంలో కావ్య కళ్యాణ్‌రామ్- కాలభైరవలు ఒకే వేదికపై కనిపించి షాకిచ్చారు. అందులో కాలభైరవ, కావ్యలు చాలా క్లోజ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కావ్య- కాలభైరవలు తమ బంధంపై ఇలా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X