బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా సరికొత్త ప్రయోగం.. ఏ దర్శకుడు చేయని రీతిలో.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సరిహద్దులను చెరిపేసిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. అడల్ట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమ తమ భాషల్లో రీమేక్ చేసుకుంటామని చిత్ర యూనిట్‌ను సంప్రదించారు. కొద్దిరోజుల క్రితం ఇదే సినిమా హిందీలోనూ రీమేక్ అయింది. అప్పటి నుంచి దర్శకుడు సందీప్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. తాజాగా ఆయన మరో ప్రయోగం చేస్తున్నారు.

సత్తా చాటిన కబీర్ సింగ్
‘కబీర్ సింగ్' పేరుతో విడుదలైన ఈ సినిమాలో షాహీద్ కపూర్ - కియారా అద్వాణీ జంటగా నటించారు. అలాగే, తెలుగు సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సందీప్ రెడ్డి వంగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘కబీర్ సింగ్'కు హిందీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో వసూళ్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలోనే ‘కబీర్ సింగ్' భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ చిత్రాల్లో స్థానం కూడా సంపాదించుకుంది.

ఒక్క స్టేట్‌మెంట్‌తో విమర్శలు
‘కబీర్ సింగ్' ప్రమోషన్‌లో భాగంగా సందీప్ రెడ్డి వంగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్భంగా తన సినిమాలో బూతు కంటెంట్ ఎక్కువైందన్న విమర్శలకు సమాధానం చెప్పాడు. ‘‘ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే వాళ్లు తమ పార్ట్‌నర్‌ను కొడుతుంటారు. అనుమతి లేకుండానే ఏమైనా చేస్తారు'' అంటూ చెప్పుకొచ్చాడు.

విమర్శలు మొదలు
సందీప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఎంతో మంది హీరోయిన్లు, సినీ ప్రముఖులు దీనిపై కామెంట్లు చేశారు. అందరికంటే ముందుగా సింగర్ చిన్మయి ఈ వీడియోపై స్పందించింది. సందీప్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఆ తర్వాత మరికొందరు ఆమెకు మద్దతుగా, సందీప్‌కు వ్యతిరేకంగా పోస్టులు చేశారు. దీంతో అతడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు.

సరికొత్త ప్రయోగం
‘కబీర్ సింగ్'తో దర్శకుడిగా సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆయన త్వరలోనే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. బాలీవుడ్‌కు చెందిన ఓ యువ దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్.


Click it and Unblock the Notifications











