»   » అవార్డుల ఫంక్షన్ లో రామ్ చరణ్ పరువు తీసిన కాజల్..!

అవార్డుల ఫంక్షన్ లో రామ్ చరణ్ పరువు తీసిన కాజల్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవార్డ్ ఫంక్షన్లకి హీరోయిన్లు రారని, వారికి షాప్ ఓపెనింగ్ లు, స్టేజీ షోలే ముఖ్యమని దాసరి నారాయణరావు కామెంట్ చేస్తే, దాసరిని తప్పుబట్టి 'ఆయన స్టేట్ మెంట్ కరెక్ట్ కాదు" అని రామ్ చరణ్ అన్నాడు. అవార్డుల వేడుకలకి హీరోయిన్లు వస్తున్నారని, ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో దాదాపుగా మీరోయిన్లంతా హాజరయ్యారని చరణ్ పేర్కొన్నాడు.

అయితే అతను అలా అన్న కొద్ది రోజులకే మాటీవీ అవార్డుల ఫంక్షన్ కి కాజల్ అగర్వాల్ డుమ్మా కొట్టింది. ఏ అవార్డుల వేడుకైనా కానీ అవార్డు ఇస్తున్నారన్నప్పుడు దానికి మర్యాద ఇవ్వడం ఆర్టిస్టుల కర్తవ్యం, ఇది మాటీవీ అవార్డే కదా అని కాజల్ లైట్ తీసుకుంది. అదే ఇవి ఫిలింఫేర్ లేదా నంది అవార్డులైతే ఆమె రాకుండా ఉండేదా? ఇలాంటి అవార్డులని చులకనగా చూస్తున్నారనే దాసరి ఆ వేడుకలో అలా అన్నారు.

అవార్డులంటే ఫిలింఫేర్ మాత్రమే అనుకుంటున్న చరణ్ పూర్తి వివారాలు తెలీకుండా హీరోయిన్ల తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. తీరా అతను హాజరయిన మాటీవీ అవార్డుల వేడుకకి కాజల్ హాజరు కాలేదు. దీంతో దాసరి వర్గానికి నోరొచ్చింది..ఇప్పుడేమంటావ్ అంటూ జోరుగా కామెంట్స్ వచ్చాయి..దాంతో చరణ్ పరువు కాస్తా గంగపాలైనట్లైంది..

English summary
The Lux Cinema Awards ceremony was held at Novotel Hotel in Hyderabad on Sunday, the 19th June. These awards were presently by MAA TV and Sandal Lux. The stars came down in all their glory.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu