twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్, రామ్ చరణ్ లకు హ్యాండ్ ఇచ్చిన కాజల్..!?

    By Sindhu
    |

    రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్ లో మెరుపు అనే చిత్రం ప్రారంభమై ఆగిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు కాజల్ డేట్స్ ఎడ్జెస్టు చేయలేక ఆగిపోయింది. ఆ తర్వాత రామ్ చరణ్ ఆమెను తన తాజా చిత్రం 'రచ్చ' కోసం అడిగారు. కానీ ఆమె నిక్కచ్చిగా తాను డేట్స్ ఇవ్వలేనని చెప్పేసింది. దాంతో రామ్ చరణ్, కాజల్ మధ్య కోల్డ్ వార్ స్టార్టయింది. అయితే చరణ్ పుట్టినరోజు సమయంలో ఆమె అమెరికా వెళ్ళి మరీ అలక తీర్చిందని వార్తలు వచ్చాయి. 'మగధీర' సినిమాని అల్లు అరవింద్ తమిళంలోకి 'మావీరన్' పేరుతో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నారు.

    దీని ఆడియో వేడుక చెన్నయ్ లో ఘనంగా జరిగింది. కానీ మగధీర తమిళ డబ్బింగ్ చిత్రం 'మావీరన్‌' ఆడియో పంక్షన్ కి ఆమె డుమ్మా కొట్టింది. అల్లు అరవింద్ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించినా ఆమె రాలేదు. దాంతో అదో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ..తమిళ మగధీరుడూ తప్పకుండా విజయం సాధిస్తాడు. నాకు చిన్నప్పట్నించీ కమల్‌హాసన్‌ అంటే ఇష్టం. ఆయన చిత్రాలు ఎన్నో చూశాను. కమల్‌కి పెద్ద అభిమానిని అన్నారు.

    English summary
    Ram Charan's 'Magadheera' Tamil version 'Maaveeran' Audio released grandly on Sunday in the presence of Kamal Hassan, Chiranjeevi and Manirathnam and others. Film's Producer Allu Aravind planned for a grand Audio Release function and invited all film unit members. Kajal Agarwal, who acquired Top Actress status in Tollywood with 'Magadheera' was absent for 'Maaveeran' Audio Release. It seems like nothing going well between Ramcharan and Kajal Agarwal as Heroine rejected to transfer 'Rachcha' dates for other film too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X