ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయటానికి మరోసారి కాజల్ రెడీ
బృందావనం చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన కాజల్ త్వరలో ఎన్టీఆర్ హీరోగా ప్రారంభం కానున్న మరో కొత్త చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కె.ఎస్.రామారావు నిర్మించనున్న చిత్రంలో ఆమెను తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఆమె 'డార్లింగ్' తర్వాత ప్రభాస్ తో 'మిస్టర్ పర్ఫెక్ట్' లోనూ, 'మగధీర' తర్వాత చరణ్ తో 'మెరుపు' చిత్రంలోనూ వరుసగా ఒకే హీరోలతో బుక్కయింది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం శక్తి చిత్రం షూటింగ్ పూర్తి చేసారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రచ్చ చిత్రం ఓకే చేసారు. జనవరి 8 నుండి ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూ షేడ్యూల్ జరగనుంది. ఎన్టీఆర్ సరసన తమన్నా ఓ హీరోయిన్. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది.
కాజల్ జూ ఎన్టీఆర్ బృందావనం డార్లింగ్ ప్రభాస్ మగధీర kajal jr ntr brindavanam prabhas darling magadheera


Click it and Unblock the Notifications