twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన కాజల్ కి షాక్ ఇచ్చిన దర్శక నిర్మాతలు...!?

    By Sindhu
    |

    దక్షిణాది చిత్రాల్లో కళ్యాణ రాముడు చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కాజల్ రామ్ చరణ్ 'మగధీర"తో ఓరేంజ్ కి వెళ్ళిపోయింది. దాంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతూ తననీ కూడా నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లేలా చేస్తున్నాయి. ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. అయితే దక్షిణాది చిత్రాల వల్ల కోటీ రూపాయ రెమ్యూనరేషన్ తీసుకునేంత క్రేజ్ సంపాదించుకున్న కాజల్ బాలీవుడ్ లో ఎంటర్ అవుతోంది.. సూర్య, అనుష్క నటించిన తమిళ్ 'సింగం" రీమేక్ లో అజయ్ దేవ్ గన్ తో సంబరాల్లో ఉండగా, దక్షిణాదిలో ఆమె కారణంగా కలంకం రేగుతోంది.

    కాగా కాజల్ బాలీవుడ్ లో అడుగుపెట్టేసరికి కళ్లునెత్తికెక్కి 'అసలు నన్ను నేను ఎన్నడూ దక్షిణాది నటిగా చూసుకోలేదు..నేను పంజాబీని కాబట్టి..నాది బాలీవుడ్డే..! అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంత ఆదరణ పొంది అక్కడికెళ్లగానే ప్లేటు ఫిరాయించిన కాజల్ గురించి చాలా వాడీ వేడిగా చర్చలు జరుగుతున్నాయి..ఆమెకి తగిన బుద్ది చెప్పాలంటే ఇక దక్షిణాది సినిమాల్లో అవకాశాలివ్వకూడదని, ఇక్కడ పూర్తిగా నిషేధిస్తే ఆమె బాలీవుడ్ లో ఏమాత్రం రాణిస్తుందో చూడాలని తమిళ తెలుగు నిర్మాతలంతా కట్టగట్టుకుని తీర్మానించుకున్నట్టు భోగట్టా...

    తొలిసారిగా హిందీ సినిమాలో హీరోయిన్ చెలికత్తెగా నటించిన కాజల్ 'మగధీర"లో పోషించిన మిత్రవింద్ పాత్రతోనే 'సింగం" దర్శకుడు రోహిత్ శెట్టిని ఆకట్టుకుంది. అసలు మగధీర అనే సినిమానే లేకపోతే కాజల్ రిలేట్ చేసుకుంటున్న ఆ సోకాల్డ్ బాలీవుడ్ సుందరిని కనీసం పట్టించుకునేది కాదని ఆమె గుర్తించాలని పరిశ్రమలోని పలువురి వ్యాక్యలు..

    English summary
    Kajal Agarwal has got into trouble for making a statement during the promo event of the Hindi flick Singham, which is a remake of the Tamil blockbuster Singam, starring Surya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X