అందుకే 'గబ్బర్ సింగ్ 2' లో కాజల్ వద్దనుకున్నారా?

By Srikanya

హైదరాబాద్ : మొదట పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ 2 లో కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆ తర్వాత వేరే హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు. దానికి కారణం కాజల్ తన రెమ్యునేషన్ పెంచేయటమే అంటున్నారు.

దాంతో ఆ అవకాసం అమలా పాల్ కి గానీ సమంతకు గానీ వచ్చే అవకాసం కనపడుతోంది. మరో ప్రక్క అంజలి హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వినపడుతున్నాయి. ఇక కాజల్ డేట్స్ ఖాళీ లేక కాదనుకుంది కానీ...రెమ్యునేషన్ రీజన్ మాత్రం కాదు అని కొందరు చెప్తున్నారు.

గబ్బర్ సింగ్-2 హిందీ వెర్షన్ దబాంగ్-2‌కు రీమేక్ కాదని తాజాగా అందుతున్న ఫిల్మ్ నగర్ సమాచారం. సరికొత్త కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, పవన్ కళ్యాణ్ మార్కు పూర్తి ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గతంలో రామ్ చరణ్ హీరోగా సూపర్ హిట్ 'రచ్చ' చిత్రాన్ని తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు సంపత్ నంది...పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు.

పవన్ కళ్యాణ్ తన సొంత బేనర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై దీన్ని సమర్పించనున్నారని, ఆయన స్నేహితుడు శంకర్ మరార్ ఈచిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు సంపత్ నంది అండ్ టీం 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టుకు సంబంధించిన పనిలో నిమగ్నమై ఉన్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X