Don't Miss!
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
యువ హీరోతో 1.75 కోట్లకు.. కాజల్ గ్రీన్ సిగ్నల్.. క్రేజీ హీరోయిన్లకు షాక్!
సాధారణంగా సీనియర్ నటిగా మారుతుంటే అవకాశాలు సన్నగిల్లుతాయి. రెమ్యూనరేషన్ తగ్గిపోతుంటుంది. కానీ కాజల్ వీటిన్నటికి అతీతంగా కనిపిస్తున్నది. అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్దకాలంగా టాలీవుడ్‌ను ఏలేస్తున్నది. వయసు పెరుగుతున్నప్పటికీ, యువ హీరోయిన్ల నుంచి గట్టిపోటీ ఉన్నా కాజల్ తన దైన నటన, గ్లామర్‌తో స్థానాన్ని పదిలంగా కాపాడుకొంటున్నది. వివరాల్లోకి వెళితే..
చిరంజీవి, రానాతో క్రేజీ ప్రాజెక్టులు
ఇటీవల కాలంలో ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా దగ్గుబాటితో నటించి మెప్పించింది. జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం నంబర్‌తో అలరించింది. అటు హిందీలోనూ, తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకడుతున్నది. తాజా టాలీవుడ్లో ఓ యువ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.
బెల్లంకొండ శ్రీనుతో నటించేందుకు
గత పదేళ్ల కెరీర్లో 50కు పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించే కొత్త చిత్రంలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రం కోసం తన కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు రూ.1.75 కోట్ల పరితోషికాన్ని తీసుకొన్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
యువ హీరోయిన్లకు గట్టిపోటి
టాలీవుడ్ మార్కెట్లో యువ తారలు పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి తారలు అందుబాటులో ఉన్నారు. అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకొంటున్నారు. ఇంకా తక్కువ రెమ్యునరేషన్‌కు కూడా రెడీగా ఉండే వాళ్లు ఉన్నారు. అయితే కాజల్‌కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
క్వీన్ రీమేక్‌లో పారిస్ పారిస్‌లో
బెల్లంకొండ శ్రీనివాస్‌తోపాటు హిందీ క్వీన్ చిత్ర రీమేక్ పారిస్ పారిస్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో కంగన రనౌత్ పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రం ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానున్నది.