twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ హీరోతో 1.75 కోట్లకు.. కాజల్ గ్రీన్ సిగ్నల్.. క్రేజీ హీరోయిన్లకు షాక్!

    |

    సాధారణంగా సీనియర్ నటిగా మారుతుంటే అవకాశాలు సన్నగిల్లుతాయి. రెమ్యూనరేషన్ తగ్గిపోతుంటుంది. కానీ కాజల్ వీటిన్నటికి అతీతంగా కనిపిస్తున్నది. అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్దకాలంగా టాలీవుడ్‌ను ఏలేస్తున్నది. వయసు పెరుగుతున్నప్పటికీ, యువ హీరోయిన్ల నుంచి గట్టిపోటీ ఉన్నా కాజల్ తన దైన నటన, గ్లామర్‌తో స్థానాన్ని పదిలంగా కాపాడుకొంటున్నది. వివరాల్లోకి వెళితే..

     చిరంజీవి, రానాతో క్రేజీ ప్రాజెక్టులు

    చిరంజీవి, రానాతో క్రేజీ ప్రాజెక్టులు

    ఇటీవల కాలంలో ఖైదీ నంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా దగ్గుబాటితో నటించి మెప్పించింది. జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం నంబర్‌తో అలరించింది. అటు హిందీలోనూ, తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకడుతున్నది. తాజా టాలీవుడ్‌లో ఓ యువ హీరోతో జతకట్టేందుకు సిద్ధమైంది.

     బెల్లంకొండ శ్రీనుతో నటించేందుకు

    బెల్లంకొండ శ్రీనుతో నటించేందుకు

    గత పదేళ్ల కెరీర్‌లో 50కు పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటించే కొత్త చిత్రంలో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ చిత్రం కోసం తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రెమ్యునరేషన్ అందుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు రూ.1.75 కోట్ల పరితోషికాన్ని తీసుకొన్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

    యువ హీరోయిన్లకు గట్టిపోటి

    యువ హీరోయిన్లకు గట్టిపోటి

    టాలీవుడ్ మార్కెట్లో యువ తారలు పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి తారలు అందుబాటులో ఉన్నారు. అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకొంటున్నారు. ఇంకా తక్కువ రెమ్యునరేషన్‌కు కూడా రెడీగా ఉండే వాళ్లు ఉన్నారు. అయితే కాజల్‌కు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

     క్వీన్ రీమేక్‌లో పారిస్ పారిస్‌లో

    క్వీన్ రీమేక్‌లో పారిస్ పారిస్‌లో

    బెల్లంకొండ శ్రీనివాస్‌తోపాటు హిందీ క్వీన్ చిత్ర రీమేక్ పారిస్ పారిస్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో కంగన రనౌత్ పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రం ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరుపుకొంటున్నది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానున్నది.

    English summary
    Still, Kajal Agarwal getting crazy projects, Reports suggest that Kajal demanded Rs 1.75 crore remuneration for her upcoming film with Bellamkonda Srinivas. This project is bankrolled by ace producer Anil Sunkara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X