రూ. 2 కోట్లు: హీరోయిన్ కాజల్ కండోమ్ యాడ్లో..?
హైదరాబాద్: హీరోయిన్ కాజల్ అగర్వాల్ సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఓ వైపు చేతి నిండా సినిమాలు, మరో వైపు వాణిజ్య ప్రకటనలు బాగానే సంపాదిస్తోంది. తాజాగా ఆమెకు మరో యాడ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఓ ప్రముఖ కండోమ్ కంపెనీ వారు ఆమెను ప్రచార కర్తగా నియమించుకోవాలనే ఉద్దేశ్యంతో సంప్రదించారట.
యాడ్లో నటించడానికి తాను ఒకే అని చెప్పిన ఆమె.....పారి తోషికం భారీగా డిమాండ్ చేసిందట. ఏకంగా రూ. 2 కోట్లు అడిగిందట. దీంతో కళ్లుబైర్లు కమ్మిన సదరు కంపెనీ వారు అంతఇచ్చుకోలేమంటూ వెళ్లి పోయారట. ఈ విషయం ఇపుడు సినిమా సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

అసలు కాజల్ సినిమాకు తీసుకునే పారితోషికమే అంత లేదు. ఈ నేపథ్యంలో యాడ్ కోసం ఇంత డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కండోమ్ యాడ్ కాబట్టి ఆమె ఇంతలా డిమాండ్ చేయడంలో అన్యాయమేమీ లేదు అని మరికొందరు వాదిస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే కాజల్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘టెంపర్' చిత్రం కాగా, తమిళంలో ధనుష్‌తో ‘మారి' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీలో అజయ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు, సుధీర్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











