»   » రామ్ చరణ్, బన్నీలను హర్ట్ చేసిన కాజల్...

రామ్ చరణ్, బన్నీలను హర్ట్ చేసిన కాజల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప డాన్సర్ ఎవరనే డిబేట్ వచ్చిన ప్రతిసారీ జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల పేర్లు చర్చకు వస్తాయి. అలాగే రామ్ పేరు కూడా కొందరు చెబుతుంటారు. అభిమానులకే కాక సినీ రంగంలోని వారికి కూడా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు జూ ఎన్టీఆర్ ని బెస్ట్ డాన్సర్ అంటే, కొందరేమో అల్లు అర్జున్ ఉత్తమ డాన్సర్ అంటారు. చరణ్ ఇంతదాకా పెద్దగా డాన్సులు చేసింది లేకపోయినా, అతను బాగా డాన్స్ చేసిన రెండు పాటల్ని బట్టి అతడూ పోటీలో ఉన్నాడని మెగా ఫాన్స్ వాదిస్తుంటారు. మరి ఈ ముగ్గురితోనూ నటించిన కాజల్ ని అడిగితే ఎవరికీ ఓటేస్తుందంటారు?

ఖచ్చితంగా జూ ఎన్టీఆరే బెస్ట్ డాన్సర్ అని కాజల్ అంటోంది. ఇండియాలోనే అతను బెస్ట్ డాన్సరని కాజల్ చెప్పింది. అంతే కాదు సింగిల్ టేక్ లోనే ఎంతటి క్లిష్టమైన డాన్సులనైనా ఇట్టే చేసేస్తుంటాడని, పెద్దగా ప్రాక్టీస్ కూడా చేయడని ఎన్టీఆర్ ని కాజల్ ఆకాశానికి ఎత్తేస్తోంది. కొంచెం కూడా డిప్లొమసీ లేకుండా ఎన్టీఆర్ ని పొగిడేసి తమ గురించి ఒక్క మాటైనా చెప్పకపోవడం అల్లు అర్జున్, చరణ్ లని హర్ట్ చేసే ఉంటుంది. ఈ స్టేట్మెంట్ తర్వాత మళ్లీ కాజల్ తో వాళ్లు సినిమా చేస్తారో లేదో మరి. అదే జరిగితే కాజల్ కి ఎన్టీఆర్ అవకాశాలిస్తాడులెండి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu