మహేష్ 'దూకుడు' హీరోయిన్ గురించి అది పుకారే
మహేష్ తాజా చిత్రం దూకుడులో కాజల్ ని కూడా హీరోయన్ గా తీసుకున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో సమంతని మాత్రమే సోలో హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. కాజల్ ని తీసుకున్నారనేది కేవలం రూమర్ మాత్రమే నని తేలింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మహేష్ ...పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇక ఈ 'దూకుడు"ని 16 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే షూటింగ్ లో భాగంగా నటీనటులు, యూనిట్ సభ్యులు టర్కీ కి బయిలు దేరుతున్నారు. అలాగే తమన్ సంగీతం దర్శకత్వంలో ....నీ దూకుడు...సాటి ఎవడు అంటూ దూకుడు కోసం ఓ పాటని రికార్డింగ్ చేసారు. ఈ చిత్రంలో మేజర్ పార్టు నార్త్ ఇండియాలో షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల తన కెరీర్ లో మొదటి సారిగా సూపర్ 35 ఎం.ఎం కెమెరాను ఈ చిత్రం కోసం వినియోగిస్తున్నాడు. టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రం రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.


Click it and Unblock the Notifications











