కాజల్ హీరో గోపీచంద్ కి పెళ్లాం అవుతోందా..!
అందాలతార కాజల్ త్వరలో హీరో గోపీచంద్ కి పెళ్లాం అవుతోంది. కంగారుపడకండి.. 'రియల్' లైఫ్ లో కాదులెండి...'రీల్' లైఫ్ లోనే! గోపీచంద్ 'మొగుడు' గా నటించే ఓ సినిమాలో కాజల్ ని కధానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి నిర్మించనున్న ఈ చిత్రంలో కధానాయికగా ముందు రిచా గంగోపాద్యాయను సంప్రదించగా డేట్స్ ప్రాబ్లం తో ఆమె'నో' చెప్పిందట. దాంతో కృష్ణ వంశీ, కాజల్ ను బుక్ చేయమన్నట్టు చెబుతున్నారు. కాజల్ ఇంతకు మునుపే కృష్ణ వంశీ డైరెక్షన్ లో 'చందమామ" సినిమాలో యాక్ట్ చేసిన బిగ్ బ్రెక్ ఇచ్చిన విషయం తెలిసిందే, అందుకే కాబోలు కాజల్ కూడా ఈ ఆఫర్ ని వెంటనే అంగీకరించిందని సమాచారం.
మార్చి నుంచి షూటింగు ప్రారంభించుకునే ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. కల్యాణీ మాలిక్ దీనికి సంగీతం సమకూరుస్తున్నాడు. కథను బట్టి దీనికి వర్కింగ్ టైటిల్ గా 'మొగుడు' అనే టైటిల్ ని అనుకుంటున్నారు. అయితే అధికారికంగా స్టార్ కాస్ట్ మరియు టెక్న్నీషియన్స్ ను అధికారికంగా తెలపాల్సి వున్నది.కాగా ఇంతవరకు కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితమైన గోపీచంద్ ని ఫ్యామిలీ టైప్ పాత్రలో ప్రేక్షకులను ఒప్పించే విధంగా కృష్ణ వంశీ ఎలా చూపిస్తాడా? అని టాలీవుడ్ లో అంతా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











