»   » గబ్బర్ సింగ్-2 హీరోయిన్ల లిస్టులో ఈవిడ కూడా..!

గబ్బర్ సింగ్-2 హీరోయిన్ల లిస్టులో ఈవిడ కూడా..!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలనే అంశంపై గత కొంతకాలంగా తర్జనభర్జన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు ఆ హీరోయిన్, ఈ హీరోయిన్ అంటూ చాలా పేర్లు వినిపించాయి. అయితే ఎవరూ ఇంత వరకు ఖరారు కాలేదు.

    తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి హీరోయిన్ కాజల్‌ను తీసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈవిడైనా పవన్ కళ్యాన్ సరసన ఖరారవుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. అనుకున్న ప్రకారం ఈచిత్రం షూటింగ్ డిసెంబర్లోనే మొదలు కావాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం మరింత ఆలస్యంగా ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

    సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం స్క్రిప్టు వర్కు ప్రధాన కారణం అయితే....హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా జాప్యం జరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాలు కూడా మరో కారణమని తెలుస్తోంది. అయితే బయటకు మాత్రం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలే ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి.

    కాగా..గబ్బర్ సింగ్-2లోని డైలాగులు అంటూ నెట్లో కొన్ని డైలాగులు హల్ చల్ చేస్తున్నాయి. 'నేను టెంపర్ లాస్ అయితే...టెంపో లేకుండా కొడతా', 'ఫస్ట్ పార్టులో నా తిక్కకి లెక్క ఉందిరోయ్...ఈ పార్టులో లెక్కే లేదు' అనే డైలాగులు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవి నిజంగానే సినిమాలోని డైలాగులేనా? కాదా? అనేది తేలాల్సి ఉంది.

    గబ్బర్ సింగ్ తొలి భాగం గుంటూరు జిల్లా కొండవీడు నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్‌గా దర్శనమిచ్చారు......సీక్వెల్ గబ్బర్ సింగ్ 2లోనూ పవన్ క్యారెక్టర్ అదే అయినప్పటికీ, సినిమా మధ్య ప్రదేశ్‌లోని చంబల్ లోయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

    ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించేది ఎవరు? అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    English summary
    Pawan Kalyan Starring ‘Gabbar Singh 2′ all set to start production. “Kajal might be the final choice as she has more experience,” says a close source.
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more