రేటు తగ్గించి బిజీ అవుతోంది
హైదరాబాద్: హీరోయిన్స్ వెండి తెరపైనే కాకుండా బయిట ఓపినింగ్స్ కు హాజరవుతూ సంపాదిస్తూంటారు. అయితే క్రేజ్ ఎక్కువ ఉన్న సమంత లాంటి హీరోయిున్ ని తెచ్చుకోవాలనే ప్రతీ షాప్ ఓనర్ ఉత్సాహపడుతూంటారు. కానీ వారి బడ్జెట్ కు వారు అందకపోతూండటంతో ప్రక్క చూపు చూస్తూంటారు. అయితే అలాంటి అవకాశం ఇవ్వటం ఎందుకు అనుకుందో ఏమో కానీ కాజల్ అగర్వాల్ మాత్రం తన రేటుని అందుబాటులో పెట్టి బిజీగా ఉంటోంది.
కాజల్ ..తను గెస్ట్ గా వెళ్లే ఓపినింగ్స్ కు రోజుకు రెండు లక్షలు తీసుకుంటోందని వినికిడి. ఆమె రామ్ చరణ్, ఎన్టీఆర్ చిత్రాల్లో హీరోయిన్ గా చేయటంతో ఆమెకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. రేటు కూడా తమకు అనుకూలంగా ఉండటంతో ఆమెను పిలుస్తున్నారు. రీసెంట్ గా ఆమె భీమవరం వెళ్లి వచ్చింది.

భీమవరం పరిసర ప్రాంతాలను చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని, ఇటువంటి చోట షూటింగ్‌కు అవకాశం వస్తే తప్పక వస్తానని సినీనటి కాజల్‌అగర్వాల్ అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రావడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు.
ప్రస్తుతం గోవిందుడు అందరివాడేతోపాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నానన్నారు. అంతకుముందు అభిమానులనుద్దేశించి తెలుగులో మాట్లాడుతూ అందరూ బాగున్నారా..? మళ్లీ మీ ముందుకొస్తానంటూ.. కొద్దిసేపు సందడి చేశారు.


Click it and Unblock the Notifications











