మళ్ళీ ఐటెం భామగా మారబోతున్న కాజల్..? ఏ తెలుగు స్టార్ తోనో తెలుసా?

గత కొన్నాళ్ల కితం వరకు తెలుగు సినిమాని అలాగే దక్షిణాది సినిమాని ఏలేసిన టాప్ మోస్ట్ హీరోయిన్స్ కొందరు ఉంటే అందులో డెఫినెట్ గా టాప్ ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరోయిన్ గా కనిపించే బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది బ్యూటీ కాజల్ అగర్వాల్ అనే చెప్పవచ్చు. కాగా కాజల్ అగర్వాల్ చాలా చిన్న గానే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ వరుస హిట్స్ సహా భారీ ఆఫర్స్ ని ఆమె సొంతం చేసుకొని తెలుగు హీరోలకి సహా దర్శక నిర్మాతలకి టాప్ ఛాయిస్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచింది.

కాగా ఇక్కడ నుంచి కాజల్ కొన్నేళ్ల పాటుగా అలా హవా కొనసాగించి ఫైనల్ గా సెటిల్ అయ్యిపోయి మొత్తానికి పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్ గా కూడా మారింది. అయితే ఎలాంటి స్టార్ హీరోయిన్స్ కి అయినా పెరుగుతున్న ఏజ్ తో పాటుగా కొన్ని కొన్ని అంశాలు మారుతాయి. అలానే ఇపుడు కాజల్ కూడా పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటుగా సినిమాలకి దూరం అయ్యింది.

kajal aggarwal again doing an item song for this telugu star

ఇక మళ్ళీ ఇపుడు రీఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు తెలుగు సహా హిందీలో కూడా చేస్తుండగా మరో పక్క ఈ మధ్య తన హాట్ షోతో డోస్ పెంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఆమెపై ఇపుడు వినిపిస్తుంది. మన తెలుగు సినిమా దగ్గర ఐటెం సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. ఎన్నో హిట్ సాంగ్స్ మన నుంచి ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో ఐటెం సాంగ్స్ అంటే మన టాలీవుడ్ అనే చెప్పొచ్చు. కాగా ఈ ఐటెం సాంగ్స్ ట్రెండ్ లో సెపరేట్ ఐటెం భామలు నుంచి హీరోయిన్స్ నే ఐటెం భామగా పెట్టి సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా కాజల్ కూడా చేసింది. కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మోహన్ లాల్ లతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ పక్కా లోకల్ అంటూ ఏ రేంజ్ లో అదరగొట్టిందో తెలుగు యువతకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కాగా ఇపుడు మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగులో ఓ భారీ సినిమాలో ఐటెం భామగా కనిపిస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అది కూడా ఎవరితోనో కాదట. తన మగధీరుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో అన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇపుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం 'పెద్ది' సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ఉండగా దాని కోసం బుచ్చిబాబు కాజల్ ని అనుకుంటున్నాడట.

దీనితో కాజల్ పేరు ఇపుడు వైరల్ గా మారింది. మరి చూడాలి కాజు నిజంగా ఈ సినిమాలో ఉందో లేదో అనేది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చ్ 26న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Read more about: kajal aggarwal ram charan ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X