మరో కొరియన్ రీమేక్.. రంగంలోకి సురేష్ బాబు.. కాజల్ సరసన అల్లరోడు!
ప్రస్తుతం రీమేక్‌ల కాలం నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీమేక్ చేయడం, సక్సెస్ కొట్టడం చాలా ఈజీ. కథ, కథనం అన్నీ అలాగే ఉంటాయి..మెయిన్ లీడ్‌ను మాత్రం మార్చేస్తే చాలు. మినిమమ్ గ్యారెంటీ ఉంటుందన్న నమ్మకంతోనే చాలా మంది నిర్మాతలు రీమేక్‌పై కన్నేస్తారు. వీరందరిలో సురేష్ బాబు మాత్రం అందరి కంటే ముందుంటారు. ఎక్కడ మంచి కథలున్నా, సినిమాలు వచ్చినా.. వాటిపై సురేష్ బాబు కర్చీప్ వేసేస్తారు. తాజాగా మరో రీమేక్‌ను సిద్దం చేస్తోన్నట్టు తెలుస్తోంది.

ఓ బేబీతో హిట్..
కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కించిన ఓ బేబీ తెలుగు నాట మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. సమంత యాక్షన్, నందినీ రెడ్డి టేకింగ్‌తో ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. సురేష్ బాబుకు ఈ మూవీతో మంచి లాభాలే రావడంతో మరో రీమేక్‌పై కన్నేశాడు.

మరో కొరియన్ మూవీపై..
కొరియన్ సినిమాలపై మన వాళ్లు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఓ బేబీ హిట్ అయిన నేపథ్యంలో మరో కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారు. డ్యాన్సింగ్ క్వీన్ అనే చిత్రాన్ని కాజల్‌తో రీమేక్ చేసేందుకు సురేష్ బాబు అంతా సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

కాజల్ సరసన అల్లరోడు..
అయితే ఈ సినిమాలో కాజల్ సరసన అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం కాజల్‌ను సంప్రదించామని, చేయడానికి ఆమె అంగీకరించిందని కూడా చెప్పుకొచ్చాడు. అయితే దర్శకుడిని మాత్రం ఇంకా ఖరారు చేయలేదన్నాడు.
Recommended Video


అలర్లోడుకు మంచి అవకాశం..
మహర్షి సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అల్లరి నరేష్.. సోలో హీరోగా నిలబడేందుకు బాగానే ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం సోలో హీరోగా అతడి చేతిలో ప్రాజెక్ట్ ఉండగానే.. ఈ రీమేక్ ఆఫర్ వరించింది. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్‌కు ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











