twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం కాజల్ అగర్వాల్.. ఆ హీరోయిన్‌పై మోజుతో ప్రభాస్, సుజిత్ అలా షాక్

    |

    టాలీవుడ్‌లో వయసు పెరుగుతున్నా ఆఫర్లు తగ్గని హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ముందుంటారు. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా హిందీ, తమిళ రంగాల్లో కూడా క్రేజీ ఆఫర్లు చేజిక్కించుకొంటున్నారు. సీనియర్, యువ హీరోలు అనే తేడా లేకుండా గ్లామర్ పాత్రలతో అలరిస్తున్నారు. ఇక హీరోయిన్ పాత్రలే కాకుండా పక్కా లోకల్ లాంటి స్పెషల్ సాంగ్స్‌లో నర్తించి ప్రేక్షకులను మత్తెక్కిస్తున్నారు. తాజాగా ఈ పంజాబీ భామకు ప్రభాస్, సాహో టీమ్ షాకిచ్చినట్టు ఓ వార్త మీడియాలో ప్రచారం అవుతున్నది. ఇంతకు ఏం జరిగింంటే..

     బ్యాడ్‌బాయ్‌లో జాక్వలైన్

    బ్యాడ్‌బాయ్‌లో జాక్వలైన్

    సాహో చిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాడ్ బాయ్ పాటలో శ్రీలంక బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ నర్తించింది. ఈ పాటలో నటించినందుకు గాను జాక్వలైన్‌కు రూ.2 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం. బాలీవుడ్‌లో ఓ స్పెషల్ సాంగ్‌కు అంత భారీగా పారితోషికం చెల్లించడం చర్చనీయాంశమైంది. అయితే ఈ పాటకు కోసం ముందుగా కాజల్‌ అగర్వాల్‌ను సంప్రదించారట.

    కాజల్ చేజారిన ఆఫర్

    కాజల్ చేజారిన ఆఫర్

    సాహో లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో పాట కోసం సంప్రదించగానే నటించేందుకు సిద్ధమయ్యారట. అయితే ప్యాన్ ఇండియా కావడంతో బెటర్‌గా ఉండే హీరోయిన్‌ కోసం ఆలోచించి జాక్వలైన్‌ను తీసుకొన్నారట. దాంతో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకొనే అవకాశాన్ని కాజల్ కోల్పోయింది. ఒకవేళ బ్యాడ్ బాయ్ పాటలో కాజల్ స్టెప్పులు వేసి ఉంటే క్రేజ్ ఎలా ఉండేదనేది ఓ ప్రశ్నగా మారింది.

    వరుస చిత్రాలతో కాజల్

    వరుస చిత్రాలతో కాజల్

    ఇక కాజల్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నది. అలాగే హిందీ క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్‌లో నటిస్తున్నది. ఇంకా నిర్మాణ రంగంలోకి కూడా ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేపట్టింది.

    ఉత్తరాదిలో సాహో ప్రభంజనం

    ఉత్తరాదిలో సాహో ప్రభంజనం

    ఇక సాహో విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల క్లబ్‌లో చేరింది. కేవలం హిందీలోనే రూ.133 కోట్ల వసూళ్లను సాధించింది. తొలి వారాంతంలోనే రూ.116 కోట్లకుపైగా సాధించిన ఈ చిత్రం దాదాపు 50 శాతానికిపైగా వసూళ్లు క్షీణించాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

    English summary
    The lovely Kajal Aggarwal is arguably one of the biggest and most established actresses in Tollywood. The 'Pakka Local' beauty has acted in quite a few big films and this has worked wonders for her career. The buzz is that the makers of Saaho went in for Jacqueline instead of Kajal as the Sri Lankan beauty is a popular name in Bollywood. Many feel that the Prabhas and co cannot be blamed for their decision as the action-thriller is more of a Hindi film than a Telugu one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X