చిరంజీవితో రొమాన్స్.. కాదనలేకపోయిన బ్యూటీ.. ఓ రేంజ్‌‌లో డిమాండ్! హాట్ టాపిక్

రాజకీయాలు వదిలి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక చిరంజీవి సూపర్ సక్సెస్ అయ్యారు. రావడం రావడమే 'ఖైదీ నెంబర్ 150' అంటూ మెగా బ్లాక్‌బస్టర్ కొట్టేసిన చిరు.. ఆ తర్వాత 'సైరా నరసింహా రెడ్డి' రూపంలో వెండితెరపై ఉగ్రరూపం చూపించి చిరకాల కోరిక తీర్చుకున్నారు. ఇక ఇప్పుడు తన 152వ సినిమా బిజీలో ఉన్నారు. ఇటీవలే సెట్స్ మీదకొచ్చిన ఈ సినిమా హీరోయిన్ విషయమై ఓ వార్త జనాల్లో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటా వార్త? వివరాల్లోకి పోతే..

 కొరటాలతో చిరంజీవి..

కొరటాలతో చిరంజీవి..

మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమా రూపంలో భారీ సక్సెస్ సాధించిన కొరటాల శివ.. తన తర్వాతి చిత్రాన్ని చిరంజీవితోనే చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో బలమైన కథ సిద్ధం చేసుకున్న ఆయన చిరు కోసం చాలా రోజుల పాటు ఎదురుచూడక తప్పలేదు. సైరా ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ రావడంతో కొరటాల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఎలాగోలా ఈ మెగా 152 మూవీ సెట్స్ మీదకు వచ్చింది.

అనుకోని అవాంతరాలు.. ట్విస్టుల మీద ట్విస్టులు

అనుకోని అవాంతరాలు.. ట్విస్టుల మీద ట్విస్టులు

నిజానికి ఈ మూవీ సెట్స్ పైకి వచ్చాక కూడా కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. పూజా కార్యక్రమాలు ఫినిష్ అయ్యాక రెగ్యులర్ షూట్‌కి రావడానికే ఎక్కువ సమయం పట్టింది. ఇంతలోనే చిరంజీవి లుక్ లీక్, సినిమా టైటిల్ లీక్, ఊహించని విధంగా హీరోయిన్ త్రిష తప్పుకోవడం లాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి.

అందుకే తప్పుకున్నా అంటూ త్రిష..

అందుకే తప్పుకున్నా అంటూ త్రిష..

అయితే చిరు 152లో త్రిష హీరోయిన్ అని వార్తలు వచ్చాయి తప్పితే.. నిజానికి ఆమెనే హీరోయిన్ అని అఫీషియల్ ప్రకటన ఎక్కడా రాలేదు. కాకపోతే అంతా ఫిక్సయ్యారు. ఈ లోగా ఈ సినిమా నుంచి తాను తప్పుకొంటున్నట్లుగా పేర్కొంది త్రిష. ''కొన్ని సార్లు అన్ని మనం అనుకున్నట్లే జరగవు.. మొదటగా చెప్పినదానికి, చర్చలు జరిపిన దానికి తగ్గట్టే అన్ని జరగవు.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా.. చిత్రయూనిట్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా'' అని త్రిష ట్వీట్ చేసింది.

కాజల్ వచ్చింది.. ఊపిరిపీల్చుకున్న మెగా ఫ్యాన్స్

కాజల్ వచ్చింది.. ఊపిరిపీల్చుకున్న మెగా ఫ్యాన్స్

ఉన్నట్టుండి త్రిష ఇలా హాడివ్వడంతో చిరంజీవి ఎవరు సూట్ అవుతారా అని బాగా ఆలోచించి చివరకు ఆమె స్థానంలో కాజల్‌ని ఎంపిక చేసిందట చిత్రబృందం. గతంలో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ 150'లో నటించి మెగా జోడీగా మెప్పుపొందింది కాజల్. దీంతో త్రిష స్థానంలో కాజల్ అని తెలిసి మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

మెగా మూవీ అయితేనేం.. కాజల్ డిమాండ్

మెగా మూవీ అయితేనేం.. కాజల్ డిమాండ్

ఇంతవరకూ బాగానే ఉన్నా.. లేటెస్ట్ సమాచారం మేరకు కొరటాల- చిరంజీవి ప్రాజెక్టులో నటించేందుకు గాను ఓ రేంజ్ రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట కాజల్. పాత్ర రీత్యా నిడివి, ప్రాధాన్యత దృష్ట్యా ఆమె కెరీర్‌లో ఇప్పటిదాకా తీసుకోనంత సొమ్ము ఆఫర్ చేస్తేనే ఓకే అని చెబుతా అంటోందట. సో చూడాలి మరి కాజల్ విషయంలో నిర్మాతలు ఎలా నిర్ణయం తీసుకుంటారో అనేది.

Recommended Video

Eureka Movie Pre Release Event Part 3
ఆచార్య కోసం మణిశర్మ.. చిరుతో రెజీనా రొమాన్స్

ఆచార్య కోసం మణిశర్మ.. చిరుతో రెజీనా రొమాన్స్

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు 'ఆచార్య' టైటిల్ ఫిక్స్ చేసినట్లు స్వయంగా చిరు మాటలతో అర్థమైపోయింది. ఇక ఈ మూవీకి మణిశర్మ అందిస్తున్న సంగీతం పెద్ద ఎసెట్ కానుందని టాక్. చిత్రంలో రెజీనా స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ విడుదల చేయాలని ఫిక్సయ్యారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X