Kajal Aggarwal: డెలివరీ తర్వాత ఆ పార్ట్‌కు సర్జరీ.. కాజల్ గురించి కలకలం రేపుతోన్న లీక్

చూపు తిప్పుకోకుండా చేసే అందం, మైమరపించే నటనతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోయినే చందమామ కాజల్ అగర్వాల్. సాదాసీదాగానే సినీ కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఎవరూ ఊహించని రీతిలో విజయాలను సొంతం చేసుకుంది. ఫలితంగా అదిరిపోయే ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకుంది. దీంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ అగర్వాల్ తాజాగా తన బాడీలోని ఓ పార్టుకు సర్జరీ చేయించుకున్నట్లు న్యూస్ లీకైంది. ఆ వివరాలను మీరే చూడండి!

నేషనల్ స్టార్‌గా కాజల్
'లక్ష్మీ కల్యాణం' అనే సినిమాతోనే కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలుపెట్టింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్‌లో సైతం అడుగు పెట్టి కాజల్ కొన్ని చిత్రాల్లో నటించింది. తద్వారా నేషనల్ స్టార్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది.

Kajal Aggarwal Did Plastic Surgery for Lips News Gone Hot Topic

తల్లైన కాజల్.. బ్రేకిచ్చి
హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఏకధాటిగా మూవీలు చేసిన కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తతో రహస్యంగా ప్రేమ వ్యవహారం నడిపింది. ఇది రివీల్ అయిన కొద్ది రోజులకే అతడిని పెళ్లాడింది. ఆ తర్వాత కూడా కెరీర్ కొనసాగించిన కాజల్.. ఓ మగ బిడ్డకు తల్లైంది. దీంతో కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని కొడుకుతో ఎంజాయ్ చేసింది.

బాలయ్యతో హిట్ కొట్టి
చాలా విరామం తర్వాత కాజల్ అగర్వాల్.. 'కోస్టీ' అనే తమిళ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కానీ, ఇది ఆమెకు సరైన రీఎంట్రీని మాత్రం అందించలేదు. దీని తర్వాత కాజల్ 'కరుంగాపియమ్' అనే తమిళ చిత్రాన్ని చేసింది. ఇది కూడా కాజల్‌కు మంచి సక్సెస్‌ను ఇవ్వలేదు. కానీ, బాలయ్యతో చేసిన 'భగవంత్ కేసరి'తో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది.

Kajal Aggarwal Did Plastic Surgery for Lips News Gone Hot Topic

ఆ సినిమాలతో బిజీగా
ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన కాజల్ అగర్వాల్.. ఈ మధ్య కాస్త స్లోగానే ఉంటోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ చిన్నది చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పటికే కాజల్ 'ఇండియన్ 2', 'సత్యభామ' వంటి సినిమాలు చేస్తోంది. ఇవి మాత్రమే కాదు.. 'కన్నప్ప'లో ఓ క్రేజీ రోల్‌కు ఓకే చెప్పింది. అలాగే, మరికొన్ని చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది.

ఆ ఫొటోలు షేర్ చేసి
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో సందడి చేస్తోంది. ముఖ్యంగా తరచూ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వదిలిన ఫొటోల్లో కాజల్ ముఖంలో ప్రధానమైన మార్పు కనిపిస్తోంది. ఈ విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Kajal Aggarwal Did Plastic Surgery for Lips News Gone Hot Topic

అక్కడ సర్జరీ వల్లనే
తాజాగా కాజల్ అగర్వాల్ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పెదాలు గతంలో మాదిరిగా కాకుండా షేప్ మారినట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్ హీరోయిన్ వాటికి సర్జరీ చేయించుకుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అందుకు తగ్గట్లే నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. దీంతో కాజల్ ప్లాస్టిక్ సర్జరీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X