స్టార్ హీరోపై కాజల్ అగర్వాల్ అసంతృప్తి.. టాప్ యాక్టర్ ఎవరంటే?

ఒకప్పుడు తెలుగు సినిమాని ఎలేసిన టాప్ అండ్ హాట్ బ్యూటీస్ చాలా మందే కనిపిస్తారు. ఇలా తెలుగు సినిమా దగ్గర ఓ రేంజ్ లో స్టార్డంని సొంతం చేసుకున్న టాప్ బ్యూటీస్ లో ఖచ్చితంగా ఇప్పటికీ కనిపించే పేర్లలో కాజల్ అగర్వాల్ పేరు లేకుండా ఆ టాపిక్ కూడా స్టార్ట్ కాదు. తన అంద చందాలతోనే కాకుండా నటన పరంగా కూడా కాజల్ తెలుగు సినిమాలో ఒక వెలుగు వెలిగింది.

ఈమె కూడా నార్త్ నుంచే వచ్చినప్పటికీ తెలుగులో లైఫ్ అందుకుంది. ఇలా టాలీవుడ్ లో ఓ రేంజ్ లో స్టార్డం చూసేసింది అంతే కాకుండా కావాల్సినంత సంపాదించుకుంది కూడా.. ఇక ఇన్నేళ్ల తర్వాత దేనికైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా దగ్గరికి వస్తుంది. ఇలా పోటీ వాతావరణంలో కొత్త హీరోయిన్స్ రావడం కాజల్ కూడా మధ్యలో పెళ్లి, పిల్లలు అని గ్యాప్ తీసుకోవడం కూడా జరిగింది.

kajal aggarwal disappointed with hero salman khan on this

దీనితో కాజల్ కొన్నాళ్ల పాటుగా తెలుగు సినిమా సహా సౌత్ సినిమాకి దూరం అయ్యింది. కాగా మళ్ళీ ఇపుడు రీఎంట్రీ కూడా ఇవ్వగా ఇపుడు తెలుగు సహా, తమిళ్ ఇంకా హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కానీ ఇపుడు ఓ టాక్ ఈమె విషయంలో వైరల్ గా మారింది. కాజల్ తన రీఎంట్రీలో ఓ స్టార్ హీరోతో సినిమా విషయంలో మాత్రం ఇపుడు చాలా అప్సెట్ అయ్యిందట.

ఏ హీరోయిన్ కి అయినా గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో ఎంత ఎక్కువ కనిపిద్దామా అని ఉంటుంది. కాగా ఇలానే ఆమె ఓ ఇండియన్ బిగ్ స్టార్ సినిమాలో ఉన్నప్పటికీ ఆమెని ఇటీవల టీజర్ లో చిన్న కట్ లో కూడా చూపించకపోవడంతో డిజప్పాయింట్ అయ్యిందట. కాగా ఆ సినిమా ఏంటి హీరో ఎవరో కూడా కాదు. బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న "సికందర్" సినిమా నుంచి అట.

kajal aggarwal disappointed with hero salman khan on this

కాగా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆల్రెడీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ చిత్రంలో ఉంది. మరి ఈ సినిమాలో వీరితో పాటుగా కాజల్ అగర్వాల్ కూడా ఉంది కానీ ఆమెని మాత్రం మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో కనీసం ఒక్క సెకండ్ ఫ్రేమ్ లో కూడా మేకర్స్ చూపించిన పాపాన పోలేదు. దీనితో కాజల్ బాగా డిజప్పాయింట్ అయ్యిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇది వరకు కాజల్ ఏ ఆర్ మురుగదాస్ తో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా మళ్ళీ కాజల్ రీఎంట్రీ తర్వాత ఇలాంటివి జరగడంతో ఓ పక్క హీరో విషయంలో అలాగే మేకర్స్ విషయంలో కూడా ఈమె అసంతృప్తిగానే ఉందట. దీనితో ఈ టాక్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాని మురుగదాస్ తన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం సర్కార్ కి రీమేక్ అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఈ ఈద్ వరకు ఆగితే తెలిసిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X